రాష్ట్రీయం

పట్టు ఎవరిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: శాసన మండలి ఉభయ గోదావరి జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరిగే ఎన్నికలపై రాజకీయ వర్గాలు దృష్టి సారించాయి. 2019 జనవరి నెలాఖరు లేక ఫిబ్రవరి మొదటి వారంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబరు మొదటి వారంలో విడుదల కానున్నట్టు సమాచారం. నోటిఫికేషన్ విడుదల అనంతరం ఉభయ గోదావరి జిల్లాల్లో పట్ట్భద్రులు ఓటర్లుగా నమోదు చేయించుకునేందుకు నెల రోజుల గడువు ఇవ్వనున్నట్టు భోగట్టా. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల పట్ట్భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కె రవికిరణ్‌వర్మ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
2019లో జరిగే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికయ్యారు. అనంతరం అనపర్తి ఎమ్మెల్యేగానూ పనిచేశారు. శేషారెడ్డి ఇప్పటికే ఆయా ఉపాధ్యాయ సంఘాలు, పట్ట్భద్రులతో సమావేశాలు నిర్వహిస్తూ వచ్చే ఎన్నికల్లో తన విజయానికి సహకరించాలని కోరుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ కె రవికిరణ్‌వర్మ, ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు)ల్లో ఎవరో ఒకరు మళ్ళీ బరిలోకి దిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అధికార టీడీపీకి చెందిన చైతన్యరాజు బరిలోకి దిగితే పార్టీ బల పరచిన అభ్యర్థిగానే బరిలో ఉంటారని సమాచారం. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో బలమైన ఉపాధ్యాయ సంఘంగా పేరొందిన యుటీఎఫ్ నుండి ఓ అధ్యాపకుడు ఎమ్మెల్సీ బరిలో ఉంటారని సమాచారం. అలాగే 2014 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజవర్గం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి చెందిన కార్పొరేట్ విద్యా సంస్థల అధినేత పోతుల విశ్వం ఎమ్మెల్సీ బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది.