ఆంధ్రప్రదేశ్‌

రావెల సుశీల్‌కు రెండు రోజుల పోలీస్ కస్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓ మహిళను వేధించిన కేసులో ఏపి మంత్రి రావెల కిషోర్‌బాబు తనయుడు రావెల సుశీల్‌కు మంగళవారం నాంపల్లి కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడికి ఆదేశించింది. సుశీల్‌కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పోలీసులు కేసు విచారణ పూర్తి చేశారని, రాజకీయ ఒత్తిడితో సుశీల్‌ను ఈ కేసులో ఇరికించారని న్యాయవాది వాదించారు. మొదట ఎఫ్‌ఐఆర్ నమోదు ఆధారంగా సుశీల్‌కు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరారు. అదే సమయంలో ఈ కేసుకు సంబంధించి మరికొంత సమాచారం తీసుకోవాల్సి ఉందని, రెండు రోజులపాటు సుశీల్‌ను కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్‌లపై కోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. ఇరువైపుల వాదనలు విన్న న్యాయ స్థానం సుశీల్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ రెండు రోజులు పోలీస్ కస్టడికి ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఈ నెల 11వ, తేదీన ఉదయం గం. 11.00లకు సుశీల్‌ను నాంపల్లి కోర్టులో హాజరు పరచాలని న్యాయస్థానం ఆదేశించింది.