ఆంధ్రప్రదేశ్‌

కుటుంబం బలవన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుంగనూరు: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్త కన్నకూతురిని లైంగికంగా వేధిస్తుండటంతో తట్టుకోలేక ఆ తలి బిడ్డలపై కిరోసిన్ పోసి తానూ నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఎస్సై హరిప్రసాద్ కథనం ప్రకారం ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఎస్‌కే రహమాన్ పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం భార్యాబిడ్డలతో పుంగనూరుకు వలసవచ్చాడు. స్థానిక మంగళంకాలనీ సమీపంలోని హిదాయత్‌నగర్‌లో నివాసముంటున్నాడు. వీరికి ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. రహమాన్ పట్టణంలోని బేకరీషాపులో పని చేస్తున్నాడు. కొన్నాళ్లుగా రహమాన్ తాగుడుకు బానిసై, విపరీతంగా అప్పులు చేశాడు. దీనికితోడు కూతురు అయేషాను లైంగికంగా వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం, అర్థరాత్రిలో కోరికతో బలవంతపెట్టడం లాంటి వికృతచేష్టలు చేస్తుండటంతో భరించలేని భార్య కొద్దిరోజులుగా గొడవపడుతోంది. తన మాటలను భర్త లక్ష్యపెట్టకపోవడంతో మానసిక సంఘర్షణ భరించలేక బుధవారం ఉదయం 6.30 ప్రాంతంలో ఇంటిలో నివసిస్తున్న పిల్లలు అయేషా (13), మహమ్మద్ (10), నాగూర్ (8), అంజుం (6)లపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. తనపైనా కిరోసిన్ పోసుకొని నిప్పుపెట్టుకుంది. ఆ సమయంలో భర్త రహమాన్ బాత్‌రూంలో ఉన్నాడు. తిరిగి వచ్చేలోపు ఇంటిలో మంటలు, కుటుంబం హాహాకారాలు గమనించి స్థానికుల సహాయంతో ఇద్దరు పిల్లలను బయటకు లాగాడు. మిగిలిన ముగ్గురిని రక్షించేలోపే వాళ్లు పూర్తిగా కాలిపోయారు. కాలిన గాయాలతో ఉన్న వారిని 108 వాహనంలో పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో తల్లి జరీనా, కూతుళ్లు అయేషా, అంజుంల పరిస్థితి విషమంగా ఉండటంతో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించేలోపే తల్లి జరీనా, కూతుళ్లు అంజుం, అయేషా మృతి చెందారు. మగపిల్లలు మహమ్మద్, నాగూర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈమేరకు బాధితుల నుంచి జస్టిస్ మోతీలాల్ వాంగ్మూలం నమోదు చేశారు. కేసు నమోదు చేసి భర్త రహమాన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.