ఆంధ్రప్రదేశ్‌

రుజువు చూపిస్తే మంత్రుల డిస్మిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అమరావతి భూముల వ్యవహారంపై విపక్షనేత జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు రుజువులు చూపిస్తే, సంబంధిత మంత్రులను తక్షణం డిస్మిస్ చేస్తానని సిఎం చంద్రబాబు సవాల్ చేశారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు చేసిన మీవద్ద రుజువులుంటే తక్షణం స్పీకర్‌కు అందించాలని జగన్‌ను డిమాండ్ చేశారు. ఆరోపణలు రుజువైతే మంత్రులను డిస్మిస్ చేస్తానన్నారు. జగన్ రుజువులు చూపించే వరకు సభ జరగదని, ముందు ఈ సంగతి తేలాలన్నారు. సిబిఐలాంటి విచారణలతో అమరావతి రాజధాని అభివృద్ధిని అడ్డుకుందామనే కుటిలయత్నాలను సాగనిచ్చేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఈ సంగతి ముందు తేల్చాలని ఆయన స్పీకర్‌ను కోరారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అనుభవరాహిత్యంతో వ్యవహరించడం వల్ల అమరావతి బ్రాండ్ ఇమేజీకి భంగం కలుగుతోందన్నారు. జగన్ మీడియా ఆస్తులు అటాచ్‌మెంట్‌లో ఉన్నాయని, వాటిని ప్రజా ఆస్తిగా పరిగణించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. బిజెపి నేతలు ప్రతిపక్ష పార్టీ మాదిరిగా విమర్శలు చేయడం తగదని చంద్రబాబు చురకలు అంటించారు. జగన్ తన ఆరోపణలు రుజువు చేయకపోతే సభకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ విషయాలు తేలేవరకు సభ జరగదని స్పష్టం చేశారు. అనంతరం మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, పి మాణిక్యాలరావు, ఎమ్మెల్యేల గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకోరాదని, సభలో జగన్ చేసిన ఆరోపణలు రుజువు చేయాలని, లేనిపక్షంలో వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సభను అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు.