రాష్ట్రీయం

23న విశాఖలో జ్ఞానభేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 20: విశాఖలో ఈనెల 23వతేదీన రెండవ జ్ఞానభేరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలియజేశారు. జ్ఞానభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని వర్శిటీల వీసీలతో సోమవారం స్థానిక ఆంద్రా యూనివర్శిటీలో మంత్రి గంటా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయూ వర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఆయన చెప్పారు. ఇప్పటికే అన్ని వర్శిటీల పరిధిలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పలు అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నారని అన్నారు. మొదటి బహుమతి గెలుపొందిన విద్యార్థికి లక్ష రూపాయలు, ద్వితీయ బహుమతి గెలుచుకున్న విద్యార్థికి 50 వేల రూపాయలు, మూడో బహుమతి గెలుచుకున్న విద్యార్థికి 25 వేల రూపాయల బహుమతి ఇవ్వనున్నామని ఆయన చెప్పారు. మొత్తంమీద 35 స్థాయిల్లో బహుమతులు ఇవ్వనున్నామని మంత్రి గంటా తెలియజేశారు. జ్ఞానభేరీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వెయిటేజ్ ఇవ్వనున్నట్టు మంత్రి ప్రకటించారు. 23వ తేదీ ఉదయం 10 గంటలకు జ్ఞానభేరి ప్రారంభం అవుతుందని, 11.50 గంటలకు విద్యార్థులతో యోగా నిర్వహిస్తామని చెప్పారు. 12 గంటలకు పోలవరంపై డాక్యుమెంటరీ ప్రదర్శన ఉంటుందని తెలియజేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు. 3.10 గంటలకు జ్ఞానభేరిపై షార్ట్ఫిల్మ్ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. నాలుగు గంటలకు చంద్రబాబు ప్రసంగం ఉంటుందని మంత్రి గంటా చెప్పారు. ఈ జ్ఞానభేరి కార్యక్రమానికి 20 వేల మంది విద్యార్థులు హాజరవుతారని గంటా చెప్పారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ట్రోఫీలు బహూకరించనున్నారు. ఈ ట్రోఫీని మంత్రి గంటా సోమవారం ఆవిష్కరించారు.

చిత్రం..జ్ఞానభేరి ట్రోఫీని ఆవిష్కరిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు