రాష్ట్రీయం

పీఎఫ్ సమాచారం అందగానే నిరుద్యోగ భృతిపై వెబ్‌సైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 20: కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎఫ్‌కు సంబంధించిన సమాచారం అందగానే ముఖ్యమంత్రి యువనేస్తం (నిరుద్యోగ భృతి) వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని, వెంటనే రిజిస్ట్రేషన్లను కూడా చేపడతామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఈ శాఖ అధికారులతో, వివిధ వర్సిటీల ప్రతినిధులతో సోమవారం మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. యువనేస్తం కార్యక్రమంపై రూపొందించిన వెబ్‌సైట్, మార్గదర్శకాలు, తదితర అంశాల గురించి మంత్రి లోకేష్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు వర్సిటీల సహకారం అవసరమన్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడంలో వర్సిటీలు సహకరించాలన్నారు. ఇప్పటికే కొన్ని వర్సిటీల్లో నైపుణ్యాభివృద్ధికి శిక్షణా కోర్సులు అందుబాటులోకి తెచ్చాయన్నారు. వర్సిటీల ప్రతినిధులు అంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. వెబ్‌సైట్‌లో ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేయగానే ఫోన్‌కు ఓటీపీ వస్తుందని, అది ఎంటర్ చేయగానే నిరుద్యోగ భృతికి అర్హులా? కాదా? అన్నది విషయం తెలిసేలా వెబ్‌సైట్ రూపొందించామన్నారు. ఒక వేళ అర్హులు కాకపోతే దానికి కారణాలను కూడా రియల్‌టైమ్‌లో తెలిసేలా రూపొందించామని వెల్లడించారు. అర్హులైనప్పటికీ, నిరుద్యోగ భృతి రాకపోతే, రియల్ టైమ్‌లో సంబంధిత సర్ట్ఫికెట్ అప్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉందని, పరిశీలన తరువాత భృతి చెల్లిస్తామన్నారు. అర్హులైనప్పటికీ, నిరుద్యోగ భృతికి రాకపోతే 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజా సాధికార సర్వే ప్రకారం 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ఈకేవైసీలో వెరిఫికేషన్ పూర్తి కాకపోతే, దగ్గరలోని మీ-సేవ కేంద్రంలో వెరిఫికేషన్ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. అవసరమైతే అధికారులే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. అర్హులందరికీ ప్రతి నెలా 1000 రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామన్నారు. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న, 25-35 ఏళ్ల లోపు వారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. పీఎఫ్ చెల్లించే వారికి ఈ పథకం వర్తించదన్నారు. ఈ పథకం అమలు కోసం బడ్జెట్‌లో 1200 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. వివిధ శాఖల అనుసంధానంతో నిరుద్యోగ భృతి చెల్లించే యువతకు నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇస్తామన్నారు.