తెలంగాణ

సరిలేని తెరాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎన్నికలు ఏవైనా అధికార తెరాస పార్టీ తిరుగులేని ఆధిపత్య పరంపర కొనసాగిస్తోంది. మొన్నటి వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక, నిన్నటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికైనా, నేటి వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లోనూ తెరాస పార్టీ విజయదుందుభి మోగించింది. కమ్యూనిస్టులకు కంచుకోట అయిన ఖమ్మం జిల్లాలోనూ తెరాస ప్రభంజనమే సృష్టించింది. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో 20 వార్డులలోనూ తెరాస కైవసం చేసుకోని రికార్డు సృష్టించింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ తెరాస తన సత్తా చాటుకొని ప్రత్యర్థి పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించింది. తెరాసకు ఆయువు పట్టయిన ఓరుగల్లు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తెరాస అత్యధిక స్థానాలు గెలుచుకొని మేయర్ పీటం ఎక్కబోతోంది. అయితే ఇక్కడ తెరాస క్లీన్ స్వీప్‌కు ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులు తొమ్మిదిచోట్ల బ్రేక్ వేసినప్పటికీ మూడింట రెండొంతుల స్థానాలను గెలుచుకొని సత్తా చాటుకుంది. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన అధికార తెరాసకు తిరుగులేదని నిరూపించుకుంటూ ప్రత్యర్థి పార్టీలను చావు దెబ్బతీస్తూ ముందుకు సాగిపోతుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 58 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ 44 స్థానాలను కైవసం చేసుకోగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 4 స్థానాలకే పరిమితం కాగా, బిజెపి-1, ఇండిపెండెంట్లు-9 (టిఆర్‌ఎస్ రెబల్స్) గెలుచుకోగా, మరో ప్రతిపక్ష పార్టీ తెదేపా అసలు ఇక్కడ బోణీ కొట్టలేకపోయింది. ఇక కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరుగాంచిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లోనూ తెరాస విజయదుందుభి మోగించింది. ఇక్కడ తెరాస దాటికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చిత్తయ్యాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో 50 స్థానాలకుగాను తెరాస 34 స్థానాలను గెలుచుకోగా, ప్రతిపక్ష కాంగ్రెస్ 10 స్థానాలను గెలుచుకుని ఫర్వాలేదనిపించింది. ఇక సిపిఎం, సిపిఎం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు తలా రెండు స్థానాలను గెలుచుకొని ఉనికిని చాటుకున్నాయి. తెరాసకు గట్టిపట్టున్న ఉత్తర తెలంగాణలోనే కాకుండా దక్షిణ తెలంగాణలోనూ తెరాస విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో అధికార తెరాస ప్రభంజనాన్ని సృష్టించింది. అచ్చంపేట నగర పంచాయతీలోని 20 వార్డులకు అన్నింటినీ తెరాస కైవసం చేసుకొని రికార్డు సృష్టించింది.

ఎన్నికల విజయంతో ఓరుగల్లులో తెరాస శ్రేణుల సంబరాలు