ఆంధ్రప్రదేశ్‌

కరవు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టును 2018లోగా కేంద్రమే పూర్తి చేస్తామంటే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అప్పగిస్తామని ఆయన తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన బుధవారం అసెంబ్లీలో సుదీర్ఘంగా ప్రసంగించారు. కొత్త రాష్ట్రానికి కేంద్రం ఇతోధికంగా సహాయం చేయాల్సి ఉందని అన్నారు. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరేందుకు తాను గురువారం ఢిల్లీ వెళుతున్నానని చెప్పారు. విభజనకు ముందు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాల్సి ఉందని అన్నారు. రాష్ట్భ్రావృద్ధికి ప్రతి ఒక్కరూ త్యాగాలు చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. వృద్ధి రేటులో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ముందున్నదని, ఇప్పటికే నాలుగు ప్రతిష్టాత్మకమైన అవార్డులు పొందామని అన్నారు. అయితే పట్టణ ఆదాయం పెరగాల్సి ఉందని అన్నారు. పట్టణాభివృద్ధి చేస్తూనే వ్యవసాయాన్నీ కాపాడుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు.
వౌలిక సదుపాయాలను ఇంకా మెరుగుపరచాల్సి ఉందని, దీనికి 30-40 వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని ఆయన చెప్పారు. ఎఫ్‌ఆర్‌బిఎం ఉందని, ఇంత కంటే ఎక్కువ అప్పు తేలేమని అన్నారు. కాగా వైకాపా తమ సొంత మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆయన విమర్శించారు. తాము ఎక్కడా పొరపాట్లు చేయడం లేదని, ప్రతిదీ పారదర్శకంగా చేస్తున్నామని చెప్పారు. రాజధానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
గత ప్రభుత్వం రాష్ట్ర విభజన బిల్లులో ఎపికి ప్రత్యేక హోదా గురించి పేర్కొనలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు చాలా అవసరం ఉందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేసిందని ఆయన దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరానికి 1200 కోట్లు ఖర్చు చేశామని, పట్టిసీమను తెచ్చామని, సంవత్సరంలోపు కృష్టా-గోదావరి నదులను కలిపామని అన్నారు. దీనిని ఎలా చేయగలరని ఇదే సభలో కొంత మంది సవాల్ చేశారని ఆయన తెలిపారు. ఇదే కాదు రాయలసీమకు నీరు ఇచ్చే బాధ్యత కూడా తమదేనని, గండికోటకు నీరు ఇస్తామని ఆయన చెప్పారు. రెండేళ్ళలో వంశధారను పూర్తి చేస్తామని, అవసరమైతే వంశధార-నాగావళిని అనుసంధానం చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం కేవలం మట్టి పనులు చేపట్టి డబ్బులు డ్రా చేసిందని ఆయన విమర్శించారు. ఏ ప్రాజెక్టు చేపట్టకుండానే మొబలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చిందని ఆయన విమర్శించారు. భూగర్భ జలాలు పెరగాల్సి ఉందని ఆయన తెలిపారు.
ఎంతో బాధ కలుగుతున్నది
తన రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను, ప్రతిపక్ష నేతలను చూశాను కానీ ఇలా మాట్లాడే వారిని చూడలేదని చంద్రబాబు జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు. వారు మాట్లాడేది వింటుంటే బాధ కలుగుతున్నదని అన్నారు. రెచ్చగొట్టడానికి, విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. బురద చల్లే పందులను దూరమే ఉంచుతామని అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని, వారిని ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. వైఎస్సార్ సిఎంగా ఉన్నప్పుడు కాపులను బిసి జాబితాలో ఎందుకు చేర్చలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన తెలిపారు. ఎవరైనా కులాల మధ్య చిచ్చుపెడితే సహించమని ఆయన హెచ్చరించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు.
కాలి నొప్పితో ఉన్నా..
తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి 2011 కిలో మీటర్లు పాదయాత్ర చేశానని, ఇప్పుడు ఎక్కువ నడిస్తే ఎడమ కాలు నొప్పి వస్తున్నదని తెలిపారు.