తెలంగాణ

తెలంగాణ ఇంటర్ పేపర్ లీక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నాటి ఇంటర్ సెకండియర్ పేపర్ లీక్ అయిందనే వార్తలు గుప్పుమనడంతో విద్యార్ధులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరోపక్క పలు కేంద్రాల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్టు విద్యార్ధి సంఘాల నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం మాథ్స్ -ఎ పేపర్ పరీక్ష జరుగుతుండగా ఈ విషయం బయటపడింది. నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని కొన్ని ప్రైవేటు కాలేజీలకు చెందిన అధ్యాపకులే ఈ పనిచేస్తున్నట్టు తెలిసింది. పరీక్ష జరుగుతున్న సమయంలోనే ప్రశ్నాపత్రాన్ని బయటకు తీసుకువెళ్లి, వాటికి సరైన సమాధానాలు రాసి తీసుకువచ్చి విద్యార్ధులకు పంచుతున్నట్టు అధికారులకు సమాచారం.
మరోవైపు ఎపిలోనూ నెల్లూరు జిల్లాలో జోరుగా కాపీయింగ్ జరుగుతున్నట్టు వార్తలు వచాచయి. నెల్లూరు జిల్లా రాపూర్‌లోని ఒక పరీక్ష కేంద్రంలో మాస్ కాపీయింగ్ జరుగుతోందని ఆరోపణలు రావడంతో స్వ్కాడ్‌లు ఆ కేంద్రాన్ని సందర్శించాయి. సెకండియర్ మాథ్స్, సివిక్స్ ప్రశ్నాపత్రాలు అంటూ కొంతమంది ప్రశ్నలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు. ఉదయం 8 గంటలకే ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో కనిపించడంతో విద్యార్థులు కంగుతిన్నారు. ఈ విషయంలో కొంత మంది తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయి ఇరు రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు పేపర్ లీక్ వార్తలను కొట్టిపారేశారు. కాగా బుధవారం నాడు తెలంగాణలో 57 మందిపైనా, ఆంధ్రాలో 11 మందిపైనా అధికారులు మాల్ ప్రాక్టీస్ కేసులను నమోదుచేశారు. ఆదిలాబాద్‌లో ఇద్దరిపై, మెదక్‌లో ఇద్దరిపై, రంగారెడ్డిలో 15 మందిపై, నిజామాబాద్‌లో 12 మందిపై, కరీంనగర్, ఖమ్మంలో ఒక్కొక్కరిపై, వరంగల్‌లో 16 మందిపై, హైదరాబాద్‌లో 8 మందిపై కేసులు నమోదుచేశారు.