తెలంగాణ

నేటినుండి నృసింహుడి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ: తెలంగాణ తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుండి 11 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు యాదాద్రి దేవస్థానం సన్నాహాలు చేసింది. పంచనారసింహస్వామి క్షేత్రంగా, కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా భక్తుల పూజలందుకుంటున్న లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు హాజరుకానున్నారు. గురువారం ఉదయం బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. సాయంకాలం ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. మరుసటి రోజు శుక్రవారం ధ్వజారోహణంతో లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానిస్తారు. ధ్వజారోహణ ప్రక్రియతో బ్రహ్మోత్సవాల ఘట్టం ఆరంభమవుతుంది. యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 17న జరిగే లక్ష్మీనరసింహుల తిరుకల్యాణోత్సవానికి ఆనవాయితీగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హాజరై పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు దేవస్థానం ఈవో గీతారెడ్డి, చైర్మన్ బి.నరసింహమూర్తి వారికి ఆహ్వానం అందచేశారు. కాగా, ఆలయ విస్తరణ పనులతో భక్తులకు సత్రాల కొరత, రాకపోకల సమస్యలు ఏర్పడినప్పటికి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అసౌకర్యాలు తలెత్తకుండా దేవస్థానం ప్రత్యేక దృష్టి సారించింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారిని 12వ తేదీ నుండి దివ్యవాహన సేవలతో తిరువీధుల్లో ఊరేగిస్తారు.
16న ఎదుర్కోలు.. 17న తిరుకల్యాణోత్సవం
బ్రహ్మోత్సవాలలో ముఖ్య ఘట్టాలైన లక్ష్మీనరసింహుల ఎదుర్కోలు ఘట్టం ఈ నెల 16న నిర్వహించనున్నారు. 17వ తేదిన జగద్రక్షులైన లక్ష్మీనరసింహుల తిరుకల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 18న దివ్య విమానోత్సవం, 19న చక్రతీర్థ స్నానం నిర్వహిస్తారు. 20న అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.