రాష్ట్రీయం

యూనివర్శిటీలుగా ఎస్‌సిఇఆర్‌టిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థలను యూనివర్శిటీలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ప్రభుత్వం నియమించిన సమీక్షా కమిటీ అభిప్రాయపడింది. ఉపాధ్యాయ విద్య, జాతీయ కౌన్సిల్ పనివిధానం, టీచర్ ట్రైనింగ్ తీరు తెన్నులపై అందరి అభిప్రాయాలను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సమీక్షా కమిటీని నియమించింది. కమిటీ బుధవారం నాడు సమావేశమై వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించింది. కాలేజీల యాజమాన్యాల ప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యావేత్తలు కమిటీతో సమావేశమై అభిప్రాయాలను చెప్పారు. ప్రైవేటు బిఇడి, డిఇడి కాలేజీలు తామరతంపరగా పెరిగిపోవడంతో ఉపాధ్యాయ విద్యలో నాణ్యతా ప్రమాణాలు దిగజారిపోయాయని, క్షాత్రోపాధ్యాయులు కాలేజీలకు హాజరుకాకపోయినా డబ్బులు తీసుకుని యాజమాన్యాలు పరీక్షలు రాయించి మరీ సర్ట్ఫికేట్లు ఇస్తున్నాయని స్కూల్ టీచర్సు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు నాగాటి నారాయణ పేర్కొన్నారు. ప్రైవేటు కాలేజీలను నియంత్రించి ప్రభుత్వ రంగంలోనే ఉపాధ్యాయ విద్యా కళాశాలలు నిర్వహించాలని సూచించారు. తెలుగుమీడియంతో పాటు ఇంగ్లీషు మీడియంలోనూ బోధించేందుకు వీలుగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని, ఉపాధ్యాయ నియామకాలకు ఆర్మీరిక్రూట్‌మెంట్ విధానాన్ని పాటించాలని, విద్యార్హతలో ప్రతిభా పాటవాలతో పాటు ఆప్టిట్యూడ్ టెస్టును నిర్వహించి అర్హులైన వారికే అడ్మిషన్ ఇవ్వాలని అన్నారు. అలాగే శిక్షణ పూర్తయిన వారినే స్కూళ్లలో నియమించాలని, దేశంలో సమ్మిళిత అభివృద్ధి, బహుళ సంస్కృతి, సామాజిక న్యాయం, శాస్ర్తియ దృక్పథం వంటి రాజ్యాంగ విలువలను ప్రతిబింబించే కరిక్యులమ్‌ను అమలుచేయాలని నారాయణ సూచించారు. భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ టీచర్ ట్రైనింగ్‌లో విద్యావ్యాపారాన్ని అరికట్టాలని, ఉపాధ్యాయ నియామకాలకు అవరోధంగా ఉన్న టెట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.