రాష్ట్రీయం

టిడిపి అంటే సంక్షేమం, అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు మొదటి దశను 2018 నాటికి పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అంతకు ముందు పోలవరం ప్రాజెక్టు టెండర్ల ఖరారులో అవకతవకలు జరిగాయని కుడికాల్వ పరిధిలో ఒక కంపెనీకి లబ్ధి చేకూర్చే విధంగా మూడు రెట్లు సొమ్మును పెంచి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రతిపక్షనేత జగన్ చేసిన ఆరోపణలకు ఆయన స్పందిస్తూ బదులిచ్చారు. బుధవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రి దేవినేని జోక్యం చేసుకుని మాట్లాడుతూ తమ ప్రభుత్వం టెండర్ల ఖరారులో పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. వైఎస్ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు నత్తనడకన కొనసాగాయన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి కావచ్చిందని, దీని వల్ల కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వడం వల్ల 2400 కోట్ల రూపాయల విలువైన పంట ఉత్పత్తులు జరిగాయన్నారు. పోలవరం పూర్తయితే ఆ మేరకు మిగిలే నీటిని రాయలసీమకు మళ్లించి భూములను సస్యశ్యామలం చేస్తామన్నారు. ప్రతిపక్షనేత జగన్ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, కాని అభివృద్ధిని నిరోధించే నేతగా తయారయ్యారని విమర్శలు చేశారు. ఈ సందర్భంగా బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ జగన్ ప్రస్తావించినట్లుగా పోలవరం ప్రాజెక్టు కుడికాల్వ టెండర్ ప్యాకేజీలో సొమ్మును మూడు రెట్లు పెంచి ఖరారు చేశారన్న అభియోగంపై మంత్రి వివరణ ఇస్తే బాగుంటుందన్నారు. అదే సమయంలో జగన్ పోలవరం ప్రాజెక్టుతో సహా అన్ని కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఈ విషయంలో ఎటువంటి అపోహలు అవసరం లేదన్నారు. అంతకు ముందు టిడిపి ఎమ్మెల్యే డి నరేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్ష పార్టీ వైకాపా సహకరించాలన్నారు. అమరావతి రాజధాని భూములపై నిరాధారాలతో దుమ్మెత్తిపోయడం తగదన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ తమపై నిరాధారమైన అభియోగాలు చేయడం తగదని, బినామీ భూములపై పసలేని ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేశారు. టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాపుల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తాము అన్ని కులాలు, మతాల పట్ల సమదృష్టితో వ్యవహరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నామని, ప్రాంతీయ, కుల విద్వేషాలు రెచ్చగొట్టడం తగదని వైకాపాకు హితవు చెప్పారు.

చక్కెర కర్మాగారాల
పునరుద్ధరణకు అధ్యయనం
* నిపుణుల కమిటీ నివేదికను
పరిశీలిస్తున్న మంత్రివర్గ ఉపసంఘం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 9: చక్కెర కర్మాగారాల పనితీరును మెరుగుపరచడంతో పాటు ఖాయలా పడిన పరిశ్రలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించిందని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. బుధవారం నాడు శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో వంగలపూడి అనిత అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ, మొత్తం పది చక్కెర కర్మాగారాలకు నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయని, ఆరు చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయని, ఫలితంగా అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి జీత భత్యాలు లేక రోడ్డున పడ్డారని అన్నారు. చక్కెర కర్మాగారాల్లో పనిచేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి పెన్షన్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ వయోపరిమితిని పెంచాలని కోరగా, మంత్రి యనమల దానికి బదులిస్తూ, ఇప్పటికే వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచడమైందని వివరించారు. ఆధునికీకరణకు నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మంత్రివర్గ ఉపసంఘం పరిశీలనలో ఉందని చెప్పారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.

కాపులను బిసిల్లో
చేర్చేందుకు కట్టుబడి ఉన్నాం
నిమ్మకాయల చినరాజప్ప
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 9: కాపులను బిసిల్లో చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. వైఎస్ హయాంలో కొన్ని కులాలను బిసి జాబితాలో చేర్చి కాపులతో సహా నాలుగు కులాలను మాత్రం వదిలేశారని అన్నారు. ముద్రగడ రెండు సార్లు ఎంపిగా పనిచేశారని, ఆనాడు కాపులను బిసిల్లో చేర్చాలన్న విషయం ఎందుకు విస్మరించారని చినరాజప్ప నిలదీశారు. ముద్రగత లేఖలో సిఎంపై వ్యక్తిగత ఆరోపణలకు దిగడం సరికాదని, కాపులను బిసిల్లో చేర్చే అంశాన్ని గవర్నర్ కూడా తన ప్రసంగంలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప నివాసంలో తెలుగుదేశం పార్టీ కాపు నేతలు అంతా భేటీ అయ్యారు.ఈ సమావేశంలో ఎపి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావు, మంత్రి నారాయణ, ఇతర కాపు నేతలు పాల్గొన్నారు. కాపులకు ప్రభుత్వపరంగా చేకూర్చాల్సిన ప్రయోజనాలను, ముద్రగడ దీక్ష అంశాన్ని ఈ భేటీలో చర్చించారు.