అంతర్జాతీయం

మైన్మార్ గద్దెపై తిన్ క్వా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపీడా: మైన్మార్ పార్లమెంటు సభ్యులు మంగళవారం ఆంగ్‌సాన్ సూకీ సన్నిహిత అనసచరుడు, చిన్నప్పటినుంచి ఆమె స్నేహితుడిగా ఉండిన తిన్ క్వాను దేశ తొలి పౌర అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతో దశాబ్ద కాలం సైనిక పాలనలో మగ్గిన ఆ దేశంలో ఒక చారిత్రక ఘట్టం మొదలైంది. ఇది సూకీ విజయంగా 69 ఏళ్ల తిన్ క్వా ప్రకటించడాన్ని బట్టి రాజ్యాంగపరంగా అధ్యక్షురాలిగా ఎన్నిక కావడానికి వీల్లేని సూకీకి ప్రతినిధిగా మాత్రమే తాను వ్యవహరిస్తానన్న స్పష్టమైన సంకేతాలిచ్చారు. దేశ రాజధాని నేపీడాలో సుదీర్ఘంగా సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలు ప్రకటించగానే ఎంపీలు ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. మొత్తం పోలయిన 652 ఓట్లలో క్వాకు 360 ఓట్లు వచ్చాయి. గత నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సూకీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్లమెంటు ఉభయ సభల్లోను తిరుగులేని మెజారిటీతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ దేశంలో బలమైన శక్తిగా ఉన్న సైన్యం సైనిక పాలన నాటి రాజ్యాంగాన్ని మార్చడానికి అంగీకరించక పోవడంతో సూకీ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యే అవకాశం లేకపోయింది. అయితే అధ్యక్షుడిగా ఎవరున్నప్పటికీ పరిపాలన తానే సాగిస్తానని సూకీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పుడు తనకు అత్యంత సన్నిహితుడైన క్వాను ఆమె తన స్థానంలో అధ్యక్షుడిగా ఎంపిక చేయడాన్ని బట్టి ఆయన పట్ల తనకు ఎంత నమ్మకం ఉందో నిరూపించుకున్నారు. ‘ఇది సోదరి ఆంగ్‌సాన్ సూకీ విజయం, మీకు కృతజ్ఞతలు’ అని ఫలితాలు ప్రకటించిన తర్వాత క్వా విలేఖరులతో అనడం సైతం దీనికి బలం చేకూరుస్తోంది. క్వా ఏప్రిల్ 1న పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. దీనితో అయిదేళ్లుగా సైన్యం మద్దతుతో పాలన సాగిస్తున్న థీన్ సీన్ పరిపాలనకు తెరపడుతుంది. అయితే సైనిక పాలననుంచి మైన్మార్ ప్రజాస్వామిక పాలనలోకి మారేలా చేసిన కీర్తి మాత్రం ఆ ప్రభుత్వానికే దక్కుతుందనేది వాస్తవం.
మంగళవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన మరో ఇద్దరు అభ్యర్థులు ఇప్పుడు దేశానికి సంయుక్తంగా ఉపాధ్యక్షులు అవుతారు. వీరిలో ఒకరు సైన్యం మద్దతుతో పోటీ చేసిన రిటైర్డ్ జనరల్ మ్యింట్ స్వే. ఇప్పటికీ అమెరికా ఆంక్షల జాబితాలో ఉన్న ఆయనకు 213 ఓట్లు రాగా, మరొకరు చిన్ తెగకు చెందిన ఎంపీ హెన్రీ వాన్ తియో. ఆయనకు 79 ఓట్లు వచ్చాయి. స్వేకు వచ్చిన ఓట్లలో అధిక భాగం పార్లమెంటులో 25 శాతం స్థానాలు రిజర్వ్ అయిన సైన్యం, సైన్యం మద్దతున్న పార్టీలకు చెందినవే. మైన్మార్ స్వాతంత్య్ర పోరాట హీరో కుమార్తెగా, ప్రజాస్వామ్యం కోసం దశాబ్దాల పాటు సాగిన పోరాటం కేంద్రం బిందువుగా ఆంగ్‌సాన్ సూకీకి దేశ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఉంది. మార్పు కోసం జరిగే ఎన్నికల్లో పాల్గొనాలంటూ సూకీ పార్టీ ఇచ్చిన పిలుపునకు స్పందించిన దేశ ప్రజలు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలకు వెల్లువెత్తడమే దీనికి నిదర్శనం. అయితే కీలకమైన హోమ్, రక్షణ, సరిహద్దు భద్రత శాఖలు ఇప్పటికీ సైన్యం చేతుల్లోనే ఉండనున్న నేపథ్యంలో సూకీ ఈ అడ్డంకులన్నిటినీ అధిగమించి దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో వేచి చూడాల్సి ఉంది.

చిత్రం... సూకీతో కొత్త అధ్యక్షుడు తిన్ క్వా