రాష్ట్రీయం

శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్ ధరల పెంపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, నవంబర్ 20: తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్ల ధరలు పెరిగే అవకాశం కన్పిస్తోంది. ఈమేరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్లు, లడ్డూ ప్రసాదం ధరలు, గదుల అద్దె పెంపు ప్రతిపాదనపై చర్చించేందుకు టిటిడి పాలక మండలి ఏర్పాటు చేసిన హేతుబద్ధీకరణ కమిటీ శుక్రవారం తిరుమల్లోని అన్నవయ్య భవనంలో తొలిసారిగా సమావేశమైంది. గత నెల 20న సమావేశమైన టిటిడి పాలక మండలి తిరుమల, తిరుపతి జెఇఒలు, ఆర్థిక సలహాదారుడు, ఎనిమిది మంది పాలక మండలి సభ్యులతో హేతుబద్ధీకరణ కమిటీ ఏర్పాటుచేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు అన్నమయ్య భవనంలో భేటీ అయిన ఈ కమిటీ దాదాపు రెండు గంటల పాటు అద్దె గదుల ధరల పెంపు , ఆర్జిత సేవా టిక్కెట్ల ధర పెంపు, లడ్డూ ధర పెంపు వంటి విషయాలపై చర్చించారు. ముగ్గురు సభ్యులు గైర్హాజరు కావడంతో నిర్ణయాలేవీ తీసుకోకుండానే సమావేశం ముగిసింది.

స్వర్ణముఖికి మళ్లీ వరద
నాయుడుపేట, నవంబర్ 20: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా గడచిన పదిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పట్టణ పరిధిలో శుక్రవారం స్వర్ణముఖి నది ప్రమాద స్థాయిలో ఉప్పొంగి ప్రవహించింది. జిల్లాతో పాటు ఎగువ ప్రాంతమైన చిత్తూరు జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వంద అడుగుల సామర్ధ్యం కల కళ్యాణి డ్యాంలో ప్రమాద స్థాయికి వరద నీరు చేరడంతో అధికారులు గేట్లు ఎత్తివేశారు. దీంతో పట్టణ పరీవాహక ప్రాంతమైన స్వర్ణముఖి నది బుధవారం ఉప్పొంగి ప్రవహించింది. తిమ్మాజి కండ్రిగ కాజ్‌వేపై పొంగి పొర్లుతున్న నదీ ప్రవాహానికి 3 చోట్ల పొర్లుకట్టలకు గండ్లు పడ్డాయి. ఈ నేపధ్యంలో శుక్రవారం కూడా డ్యాం గేట్లను అధికారులు రెండవ సారి ఎత్తి వేయడంతో మరోసారి తిమ్మాజి కండ్రిగ కాజ్‌వే వద్దనదీ ప్రవాహం ఉప్పొంగి ప్రవహించింది.