ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో ప్రైవేట్ వసతి గృహాలకు అనుమతి లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తిరుమలలో ప్రైవేటు వసతి గృహాల నిర్మాణానికి అనుమతిచ్చేది లేదని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు స్పష్టం చేశారు. శాసన మండలిలో మంగళవారం జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో తిరుమల కొండపై ప్రైవేటు అతిథి గృహాలను నిర్మించేందుకు స్థలాలను సమకూర్చే ప్రతిపాదన ఉందా? అని ఎమ్మెల్సీ తిప్పే స్వామి అడిగిన ప్రశ్నకు మాణిక్యాల రావు సమాధానం చెపుతూ తిరుమల కొండలపై ప్రైవేటు నిర్మాణాలను 2005-06లోనే నిషేధించారని అన్నారు. కొండలపై పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. దీనిపై తిప్పేస్వామి మాట్లాడుతూ తిరుమల కొండపై వందల కోట్ల రూపాయలతో అతిథి గృహాలు నిర్మించేందుకు ప్రైవేటు వ్యక్తులు ముందుకు వస్తున్నారని, ఆ గృహాలను టిటిడికే అప్పగించడానికి వారు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయినప్పటికీ, తిరుమలలో అందుకు అనుమతి లేదని మంత్రి స్పష్టం చేశారు.