ఆంధ్రప్రదేశ్‌

ఇక విద్యుత్ ఆదా చేసే ఫ్యాన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విద్యుత్ ఆదా చేయడమేగాక కాలుష్యాన్ని నియంత్రించగలిగే కాంతివంతమైన ఎల్‌ఇడి బల్బుల పంపిణీకి శ్రీకారం చుట్టిన ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(ఈపిడిసిఎల్) ఇపుడు మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. గృహ వినియోగదారులకు త్వరలో సీలింగ్ ఫ్యాన్లు (ఫైవ్ స్టార్ రేటేడ్) పంపిణీ చేయాలని నిర్ణయించింది. విద్యుత్ ఆదాతో పాటు కాలుష్యాన్ని నియంత్రించగలగడం, వినియోగదారులకు వాయిదాల పద్ధతిలో నెల వారీ విద్యుత్ బిల్లులతో కలిపి చెల్లించే సౌలభ్యాన్ని వినియోగదారులకు సంస్థ కల్పించనుంది. ఫ్యాన్ ఖరీదు రూ.1500 కాగా దాన్ని కేవలం రూ.వెయ్యికే అందివ్వనుంది. ఈ మొత్తాన్ని కూడా ఒకేసారి కాకుండా ప్రతినెల కనీసం రూ.80 నుంచి రూ.వంద వరకు వాయిదాల పద్దతిలో చెల్లించే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ సరికొత్త పథకాన్ని వచ్చేనెలాఖరులో ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సంస్థ పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి కనీసం 40 వేల ఫ్యాన్లు అవసరమని గుర్తించారు. ఐదు జిల్లాల్లో దాదాపు 53 లక్షల మంది వినియోగదారులుండగా ఇందులో పరిశ్రమలు (హెచ్‌టి), వ్యవసాయ విద్యుత్ వినియోగదాలు 20 శాతం మంది ఉంటారు. వీటిని మినహాయించి 40 లక్షల ఫ్యాన్లు గృహ వినియోగదారులకు పంపిణీ చేయాలని సంస్థ అధికారులు అంచనా వేశారు. ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని విశాఖపట్నం నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎనర్జీ ఎఫీషియన్సీ కార్పొరేషన్ (ఇఇసి) ఆధ్వర్యంలో వీటిని అందుబాటులోకి తీసుకువస్తుండగా ఈపీడీసిఎల్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టినుంది. ఇదిలా ఉండగా ఎల్‌ఇడి బల్బుల ద్వారా ఒక్కో ఇంటికి ఏడాది మొత్తంపై 50 నుంచి 60 యూనిట్ల మేర విద్యుత్ ఆదా చేయవచ్చని సంస్థ లెక్కలు కట్టింది. ఈ విధంగా ఏడాది మొత్తంపై ఐదు లక్షల యూనిట్ల వరకు విద్యుత్ ఆదా అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫ్యాన్ల వినియోగం వల్ల ఏడాదికి 20 నుంచి 30 యూనిట్ల వరకు విద్యుత్ ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల విద్యుత్ డిమాండ్‌ను అధిగమించడం, విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం రాదని సంస్థ వర్గాలు భావిస్తున్నాయి. విద్యుత్ ఆదాతో పాటు బహుళ ప్రయోజనాలు కలిగి ఉండే పథకాలను ప్రవేశపెట్టడంలో ఈపీడీసీఎల్‌అగ్రగామిగా నిలుస్తోంది. ధేశంలో ఉన్న 48 డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో మరెక్కడా అమలు కాని సరికొత్త పథకాలు నిర్వహించడం గర్వకారణం.