తెలంగాణ

చండీయాగానికి గవర్నర్ దంపతులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించబోయే అయుత చండీయాగానికి రావాల్సిందిగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను ఆహ్వానించారు. చండీయాగం ప్రారంభం కానున్న ఈ నెల 23వ తేదీననే యాగానికి రానున్నట్టు గవర్నర్ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లి అయుత చండీయాగానికి రావాల్సిందిగా గవర్నర్ దంపతులను ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ఆహ్వానానికి సంతోషించిన గవర్నర్, తప్పని సరిగా వస్తానని హామీ ఇచ్చారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కూడా యాగానికి రావాల్సిందిగా ఆహ్వానించగా ఆయన ఈనెల 27 వస్తానని మాట ఇచ్చినట్టు గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించారు. రాష్టప్రతి రాక సందర్భంగా ఆయన వెంట ఎలాగు యాగానికి వస్తానని, అయితే అంతకుముందు స్వయంగా యాగంలో పాల్గొంటానని గవర్నర్ చెప్పినట్టు తెలిసింది. అయితే ఈ నెల 23న యాగం ప్రారంభం అయ్యే తొలి రోజు వస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి సూచించగా, గవర్నర్ అంగీకరించినట్టు సమాచారం.ఇలా ఉండగా చండీయాగానికి రాష్టప్రతితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ముఖ్యమంత్రి ఆహ్వానించినప్పటికీ ఆయన కార్యాలయం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదని టిఆర్‌ఎస్ పార్టీ వర్గాల సమాచారం.