ఆంధ్రప్రదేశ్‌

ఫైబర్ నెట్ వచ్చేస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ఇంటర్నెట్ సదుపాయాలకల్పనలో మరో విప్లవాత్మక అడుగు పడబోతోంది. నామమాత్రపు రుసుముతో కేబుల్, టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్లు అందించే ఫైబర్‌నెట్‌ను ప్రయోగాత్మకంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అమలు చేసే ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖలో గురువారం ప్రారంభించనున్నారు. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో 10 ఎంబిపిఎస్ వేగంతో కేవలం రూ.150కే ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నారు. తొలి దశలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వినియోగదార్లకు ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. కేబుల్ కనెక్షన్లతో ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు వీలుగా జరుగుతున్న ఏర్పాట్లను ఫైబర్‌నెట్ మేనేజింగ్ డైరెక్టర్ కె.సాంబశివరావు మంగళవారం విశాఖ నగరంలో పరిశీలించారు. వినియోగదారులకు సెట్‌టాప్ బాక్స్‌తో కూడిన ఫైబర్‌నెట్ కనెక్షన్ ఇవ్వడంతో పాటు భవిష్యత్‌లో మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు వీలుగా సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఫైబర్‌నెట్ కనెక్షన్లు మంజూరు చేసేందుకు అవసరమైన వౌలిక సదుపాయాల కల్పన విషయంలో అధికార యంత్రాంగం ఇప్పటికీ సన్నద్ధం కాలేకపోతోంది. ముఖ్యంగా ఫైబర్‌నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు వీలుగా కేబుల్ వ్యవస్థను ఏ విధంగా నిర్వహించాలన్న అంశంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ఇప్పటికే నగరంలో విద్యుత్, కేబుల్ వైర్లతో పూర్తి అస్తవ్యస్తంగా ఉన్న విధానం వల్ల ఫైబర్‌నెట్ కల్పన ఎంత వరకు సాధ్యపడుతుందన్నది ప్రశ్నార్ధకంగా మారింది. భూగర్భ కేబుల్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే తప్ప ఫైబర్‌నెట్ కనెక్షన్ల జారీ సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాలారిష్టాలెన్ని ఉన్నప్పటికీ అనుకున్న ప్రకారం తొలి దశ ఫైబర్‌నెట్ కనెక్షన్ల జారీ చేయాల్సిందేనన్న పట్టుదలతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇదే అంశాన్ని ఫైబర్‌నెట్ సంస్థ ఎండి సాంబశివరావు వెల్లడించారు. ఆయన కలెక్టర్‌తో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, సాధ్యాసాధ్యాలను పరిశీలించారు.