ఆంధ్రప్రదేశ్‌

హడలెత్తించిన ఏసిబి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె: రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే ముగ్గురు అవినీతి అధికారులు ఏసిబికి చిక్కారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఉన్న హంద్రీ-నీవా ప్రాజెక్టు కార్యాలయం డిప్యూటీ ఇంజనీర్ మద్దిలేటికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణతో ఏసిబి అధికారులు మంగళవారం ఆయన ఇంటిపైనా, కుటుంబ సభ్యుల ఇంటిపైనా ఏకకాలంలో సోదాలు చేశారు. హంద్రీ-నీవా సృజలస్రవంతి ప్రాజెక్టు చిత్తూరు-మదనపల్లెలోని సబ్‌డివిజన్-3 కుప్పం బ్రాంచికెనాల్ డిప్యూటి ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ మద్దిలేటి పనిచేయు మదనపల్లె కార్యాలయంలో, కుప్పం పనిచేయు ప్రాంతం, నివాసముంటున్న బెంగళూరులో మంగళవారం అవినీతి నిరోదక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కిప్పం బ్రాంచికెనాల్ పరిధిలో డిఇ పనిచేస్తు బెంగళూరులో నివాసముంటున్నారు. వారంలో మూడురోజుల మినహా మిగిలిన రోజులలో అప్పుడప్పుడు మదనపల్లె సర్కిల్ హంద్రీ-నీవా కార్యాలయాని వచ్చేవారు. ఈ క్రమంలో మద్దిలేటిపై ఏసిబికి ఫిర్యాదు అందింది. పూర్తిస్థాయి నివేదికలను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.
ఏసిబి వలలో ఉపాధి అధికారి
గాజువాక: ఓ నిరుద్యోగి నుంచి రూ.1.50 లక్షల లంచం తీసుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్ జూనియర్ ఉపాధి కార్యాలయం అధికారి పిఎం.సతీష్‌కుమార్ మంగళవారం ఎసిబి అధికారులకు చిక్కాడు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంలో భూములో కోల్పోయిన శ్రీకాకుళానికి చెందిన తమ్మినేని రామయ్య ప్రభుత్వం ఇచ్చిన ఆర్-కార్డును కుమారుడు జయప్రకాష్ పేర బదలాయించి స్టీల్‌ప్లాంట్ జూనియర్ ఉపాధి కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వెళ్లగా సీనియర్ అధికారి సతీష్‌కుమార్ రూ.8 లక్షలు లంచం అడిగాడు. చివరకు రూ.1.50 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. రామయ్య ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. పెదగంట్యాడ మండలం వికాస్‌నగర్ ప్రభుత్వ న్యూ ఐటిఐ ఆవరణలో ఉన్న స్టీల్‌ప్లాంట్ జూనియర్ ఎంప్లామెంట్ కార్యాలయంలో సీనియర్ అధికారి సతీష్‌కుమార్‌కు డబ్బు ఇస్తుండగా ఎసిబి ఎసిబి డిఎస్‌పి రామకృష్ణప్రసాద్ సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. పలు రికార్డులను అధికారులు సీజ్ చేశారు.
లంచంతో దొరికిపోయన ఎఎస్సై
రాజమహేంద్రవరం: కుటుంబ తగాదాల నేపథ్యంలో తనపై పెట్టిన కేసును తప్పుడు కేసుగా నివేదించాలని కోరిన మహిళ నుండి లంచం డిమాండుచేసిన ఒక ఎఎస్సై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) వలలో చిక్కాడు. రూ.5000 లంచం తీసుకుంటున్న రాజమహేంద్రవరం ప్రకాష్‌నగర్ పోలీసుస్టేషన్ ఎఎస్సై గుర్రం రాధాకృష్ణను ఎసిబి అధికార్లు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి డిఎస్పీ పి రామచంద్రరావు కథనం ప్రకారం ప్రకాష్‌నగర్ పరిధిలోని తిలక్‌రోడ్డులో గల అభయ ఆసుపత్రి వద్ద ఒక కొట్లాట జరిగింది. గతంలో ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన శ్రీనగర్‌కాలనీలో నివసించే కొల్లివలస హారిక, ఆమె సోదరుడు శ్రీహర్షకు మధ్య ఈ నెల 11న కొట్లాట జరిగింది. ఈమేరకు శ్రీహర్ష ప్రభుత్వాసుపత్రి ద్వారా ప్రకాష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో వచ్చిన ఈ కేసును తప్పుడు కేసుగా సిఫార్సు చేయడానికి ఎఎస్సై రాధాకృష్ణ రూ.10 వేలు లంచం డిమాండ్‌చేశారు. ఆమె అంత మొత్తం ఇచ్చుకోలేనని 5000 ఇస్తామని బేరం కుదుర్చుకున్నారు.
పొందుగల చెక్‌పోస్టుపై ఎసిబి దాడి
దాచేపలి: ఆంధ్ర-తెలంగాణ సరిహద్దులో గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద ఉన్న పొందుగల కమర్షియల్ ట్యాక్స్ చెక్‌పోస్ట్‌పై మంగళవారం తెల్లవారుఝామున ఏసీబి అధికారులు ఆకస్మికంగా దాడి చేసి అదనంగావున్న 36 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుఝామున చెక్‌పోస్ట్‌పై దాడి చేయగా అదనంగా 36 వేల రూపాయలు లభించాయని చెప్పారు.