ఆంధ్రప్రదేశ్‌

రూల్స్‌కు పాతర: జగన్ సభకే అధికారం: యనమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ప్రధాన ప్రతిపక్షం ఇచ్చిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా మంగళవారం శాసనసభా వ్యవహారాల మంత్రి రామకృష్ణుడు, విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మధ్య గంభీరమైన చర్చ జరిగింది. మంగళవారం మధ్యాహ్నం శాసనసభ సమావేశం కాగానే స్పీకర్ కోడెల మాట్లాడుతూ, స్పీకర్‌ను తొలగించాలంటూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన వైకాపా ఎమ్మెల్యేలు కె. శ్రీధర్‌రెడ్డి తదితరులు ఇచ్చిన నోటీసును చర్చకు చేపడతున్నట్టు ప్రకటించారు. ఈ సమయంలో జగన్, యనమల మధ్య వాద సంవాదాలు ఇలా నడిచాయి.
జగన్: స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా చర్చ చేపట్టేందుకు శాసనసభ నియమావళి 71 ప్రకారం 14 రోజుల వ్యవధి అవసరం. శాసనసభ రూల్స్ అండ్ ప్రొసీజర్ ప్రకారం చర్చకు 14 రోజుల గడవు అవసరం, అలాగే కౌల్ అండ్ షక్దర్ రాసిన పార్లమెంటరీ ప్రొసీజర్ ప్రకారం కూడా 14 రోజుల గడవు అవసరం. అవిశ్వాస తీర్మానంపై సభ్యులు తీసుకునే నిర్ణయం కోసం విప్ జారీ చేయాల్సి ఉంటుంది. మా పార్టీకి (వైకాపా) చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను టిడిపిలో కలుపుకున్నారు, వారు రాజీనామా చేయాల్సి ఉంటుంది లేని పక్షంలో స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించాల్సి ఉంటుంది. మాకు విప్ జారీ చేసే అవకాశం కూడా ఇవ్వకుండా వెంటనే చర్చ చేపడుతున్నారు.
యనమల: చంద్రబాబు ప్రభుత్వంపై నిన్న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వైకాపా చేతులు కాల్చుకున్నారు, ఈరోజు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి చర్చనుండి పారిపోతున్నారు. అసెంబ్లీ నియమ నిబంధనల్లోని 71(2), 72(3), 73 లను తొలగిస్తూ తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను.
స్పీకర్: ఈ మూడు నిబంధనలను సభ ముందు ఉంచుతున్నాను. (అధికారపక్షం సభ్యులు చప్పట్లు చరిచారు). ప్రభుత్వం ప్రతిపాదనకు సభ ఆమోదం లభించింది. మూడు నిబంధనలు సస్పెండ్ అయినట్టు ప్రకటించారు
యనమల: సభా కార్యక్రమాలు కొనసాగించేందుకు అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టండి.
జగన్: వైకాపాకు చెందిన 8 మంది సభ్యులను అవినీతి సొమ్ముతో ప్రలోభపెట్టి టిడిపిలో చేర్చకున్నారు. వీరికి వైకాపా బిఫారం ఇచ్చింది, ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు.
యనమల: జోక్యం చేసుకుంటూ, స్పీకర్‌పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై మాత్రమే మాట్లాడాలి.
జగన్: అధికారపక్షం నియమావళికి తిలోదకాలు ఇస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తోంది. విప్ జారీ చేసే అవకాశం కూడా ఇవ్వడం లేదు.
యనమల: ఈ సభకు విప్‌కు సంబంధం లేదు.
జగన్: ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ నుండి గెలిచి, పార్టీ నుండి వెళ్లిపోతే సభ్యత్వం కోల్పోతారని రాజ్యాంగం 10 వ షెడ్యూల్‌లో ఉంది. రాజకీయాల్లో నేతలకు క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలి. చంద్రబాబుకు క్యారెక్టర్ లేదు. సొంత మామను వెన్నుపోటు పొడిచి సిఎం పదవి పొందారు.
యనమల: స్పీకర్‌పై నోటీసుపైనే మాట్లాడాలి. మిగతా విషయాలు వద్దు.
స్పీకర్: స్పీకర్‌పైనే అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. ఈ సమయంలో జరిగే చర్చ సందర్భంగా చైర్‌స్థానంలో నేను ఉండలేను. (సభాకార్యాక్రమాలు సాగించాలంటూ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ను కోరి వెళ్లిపోయారు).
ఉపసభాపతి ఆదేశాల మేరకు చర్చ మొదలైంది.