రాష్ట్రీయం

కేసీఆర్ కుటుంబాన్ని తరిమేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కుటుంబాన్ని రాష్ట్రం నుంచి తరమి కొట్టాలని పీసీసీ అద్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. జడ్చర్లకు చెందిన వ్యాపారవేత్త అనిరుధ్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ ఆవరణలో ఏర్పాటైన సభలో ఉత్తమ్ ప్రసంగిస్తూ తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ, వేధిస్తున్న పోలీసులు వెంటనే వాటిని నిలిపి వేయాలన్నారు. లేనిపక్షంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సదరు పోలీసు అధికారుల సంగతి చూస్తామని హెచ్చరించారు. 2004లో జరిగిన దొంగ పాస్‌పోర్టు కేసులో ఎఫ్‌ఐఆర్‌లో కేసీఆర్, హరీష్ రావు పేర్లు ఉన్నాయని, తమ పార్టీ నాయకుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) పేరు లేదని ఆయన తెలిపారు. హరీష్ రావు గుజరాత్ మహిళను తన భార్యగా చూపించి దొంగ పాస్ పోర్టు ఇప్పించి అమెరికా పంపించారని విమర్శించారు. ఇప్పుడు జగ్గారెడ్డిపై తప్పుడు కేసు బనాయించారని ఉత్తమ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటున్నదని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య జరగనున్న పోటీ కాదనీ, కేసీఆర్ కుటుంబానికీ ప్రజలకూ మధ్య జరుగుతున్న ఎన్నికలని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకునేందుకే కేసీఆర్ ప్రాజెక్టులకు రీ-డిజైన్లు చేశారని ఉత్తమ్ విమర్శించారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచి నీళ్ళు అందిస్తున్నామని కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తున్నదని, పార్టీ విజయం సాధించడం ఖాయమని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇప్పిస్తామని, దళిత, గిరిజన కుటుంబాలకు ఉచితంగా రేషన్ ఇప్పిస్తామని, వృద్ధాప్య పెన్షన్ రెండు వేలు, వికలాంగుల పెన్షన్ మూడు వేలు ఇస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు.