రాష్ట్రీయం

రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాంగ్రెసు సీనియర్ నేత రేవంత్‌రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఆర్‌పీసీ 41 కింద నోటీసులు జారీ చేశారు. హౌసింగ్ సొసైటీకి చెందిన భూముల వ్యవహారంలో రేవంత రెడ్డిపై సొసైటీకి చెందిన వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేవారు. కేసుకు సంబంధించి విచారించడానికి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు రావాలని రేవంత్‌రెడ్డికి పోలీసులు సమాచారం ఇచ్చారు. తాను అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమయం కేటాయించలేనని పోలీసులకు వివరించారు. మరో 15 రోజుల్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి వెళ్ళాలని పోలీసులు సూచించారు. రేవంత్ రెడ్డితో పాటు మరో 13 మందిపై కేసు నమోదు చేశారు.
అరెస్టు చేయండి, చూస్తా..
‘నన్ను అరెస్టు చేయించండి, చూస్తా..’ అని కే. చంద్రశేఖర్ రావుకు సవాల్ విసిరారు. ముందస్తు ఎన్నికల్లో ఓటమి భయంతోనే, తనపై రాజకీయ కక్ష గట్టి జూబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలతో కేసు నమోదు చేయించారని రేవంత్ రెడ్డి బుధవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. తమను కేసులతో వేధించేందుకు కేటీఆర్ తన సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులను నియమించారని ఆయన తెలిపారు. తమను వేధిస్తున్న అధికారుల పేర్లను కాంగ్రెస్ డైరీలో రాసుకుంటున్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. దొంగ పాస్ పోర్టుల కేసులో సిట్టింగ్ జడ్జిచే విచారణకు గవర్నర్ ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ తమను జైలుకు పంపించినంత మాత్రాన భయపడేది లేదన్నారు. తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ మంత్రిగా ఉన్న రోజుల్లో హరీష్ గుజరాత్ మహిళను తన భార్యగా అమెరికాకు పంపించారని, ఈ కేసులో బోధన్ ఎమ్మెల్యే షకీల్ కూడా ఉన్నారని ఆయన చెప్పారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఛార్జీషీట్లో నుంచి కేసీఆర్ హరీష్ పేర్లను తప్పించారని అన్నారు. మనుషుల అక్రమ రవాణా కేసులో కేసీఆర్, హరీష్ రావుపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తుపాకినే లేని గండ్ర వెంకటరమణా రెడ్డిపై తుపాకితో బెదిరించినట్లు కేసు పెట్టారని రేవంత్‌రెడ్డి తెలిపారు.