రాష్ట్రీయం

ఒక్క ఓటు.... రెండు దెబ్బలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: ఢిల్లీ, అమరావతి కేంద్రంగా ఉండే పార్టీలకు పెత్తనం కట్టబెడదామా? స్వీయ రాజకీయ అస్థిత్వ పాలన కావాలో? తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలని ఆపద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర పోరాటం జరిగిందే ఆత్మగౌరవం కోసమని కేటీఆర్ గుర్తు చేసారు. టీఆర్‌ఎస్‌కు అధిష్టానం తెలంగాణ గల్లీలో ఉందన్నారు. తెలంగాణకు అడ్డుపడిన రెండు గడ్డాలను (చంద్రబాబు నాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి) ఒకేసారి ఓడించడానికి ఈ ఎన్నికల ద్వారా వచ్చిన సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత కేఆర్ సురేశ్ రెడ్డి, మాజీ మంత్రి నేరళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, కాంగ్రెస్ ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జీ బండారి లక్ష్మారెడ్డి తదితరులు బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తూ ఈ రాష్ట్రాన్ని యాబై ఏళ్లపాటు కాంగ్రెస్, 17 ఏళ్ల పాటు టీడీపీలు పాలించగా, టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నది కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమేనని అన్నారు. అయినప్పటికీ చిల్లర ప్రతిపక్షాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ మంచి పని చేపట్టినా అడ్డుపడటమే పనిగా పెట్టుకున్నాయంటూ కాంగ్రెస్, టీడీపీపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా కలిసి వస్తుండగా, తెలంగాణలో మాత్రం ప్రాజెక్టులు కట్టకుండా ప్రతిపక్షాలు కోర్టులకెళ్లి అడ్డుపడుతున్నాయని విమర్శించారు. నాలుగేళ్లుగా తొండి చేస్తోన్న ప్రతిపక్షాలకు ప్రజాకోర్టులోనే తగిన బుద్ధి చెప్పాలన్నదే ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి కారణమని కేటీఆర్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సిద్ధమేనని బయట బీరాలు పలికిన విపక్షాలు, ఎన్నికల కమిషన్ ముందు మాత్రం ఎన్నికలకు తొందరేముందని ప్రశ్నించాయని అన్నారు. పదవీకాలం తీరకముందే అధికారాన్ని వదులుకోవడానికి ఏ పాలకపక్షం కూడా సిద్ధపడదని చెప్పారు. అయినప్పటికీ తాము ఎనిమిది నెలల ముందే అధికారాన్ని త్యాగం చేసి ప్రజల తీర్పుకోసం వెళ్తున్నామని గుర్తు చేసారు. తాము తీసుకున్న నిర్ణయానికి విపక్షాలు సంతోషించాల్సిందిపోయి ప్రజల తీర్పు కోరడానికి భయపడిపోతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ కలయికను అసహ్యం, జుగుస్సాకరం, నీచం అంటూ అభివర్ణించారు. ముదిగొండలో కాంగ్రెస్, బషీర్‌బాగ్‌లో టీడీపీ హయాంలో రైతులపై కాల్పులు జరిగాయన్నారు. ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. దివంగత ఏన్టీఆర్ టీడీపీని స్థాపించిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అని కేటీఆర్ గుర్తు చేసారు. అలాంటి పార్టీని కాంగ్రెస్‌కు తోక పార్టీకి మార్చడం దౌర్భగ్యమని కేటీఆర్ ధ్వజమెత్తారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సెంచరీ కొట్టాలని అనుకున్నప్పటికీ 99 సీట్లను గెలుచుకోగలిగామన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్ శాంతి టీఆర్‌ఎస్‌లో చేరికతో తమ సెంచరీ సాకారం అయిందన్నారు. బండారి లక్ష్మారెడ్డి చేరికతో ఉప్పల్‌లో గులాబీ జెండా ఎగరేయబోతున్నామన్నారు. మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి మేధోసంపత్తిని తెలంగాణ అభివృద్ధి కోసం వినియోగించుకుంటామన్నారు. ఆయన చేరిక కార్యక్రమానికి పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రావాల్సి ఉన్నప్పటికీ జ్వరం, కొండగట్టు సంఘటనతో బాధలో ఉండి రాలేకపోయారని కేటీఆర్ అన్నారు.
బంగారు తెలంగాణ కోసమే..
సురేశ్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానికి వంద సంవత్సరాలు, తనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌లో చేరారన్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమన్నారు. కాంగ్రెస్‌లో తనవంతుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కృషి చేశానన్నారు. తెలంగాణ పట్ల తనకున్న అంకితభావాన్ని గుర్తించే కేసీఆర్ తనను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారన్నారు. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు మాట్లాడుతూ, సురేశ్ రెడ్డికి తెలంగాణ అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధిని గ్రహించే కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీకృష్ణ కమిటీకి వాదన వినిపించే బాధ్యతను సోనియా గాంధీ ఆయనకు అప్పగించారని గుర్తు చేసారు. ఈ సమావేశంలో ఇంకా ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు కవిత, మల్లారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, షకీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.