రాష్ట్రీయం

జోన్ కోసం టీడీపీ ఎంపీల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం స్థానిక డీఆర్‌ఎం కార్యాలయంలో జరిగిన ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ సమావేశంలో ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ ఎంపీలు నిరసన తెలియచేశారు. సమావేశంలో ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ ఎదుట ఎంపీలు తమ వాదనను వినిపించారు. ఎంపీ అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖకేంద్రంగా రైల్వే జోన్ కావాలని దశాబ్దాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. జోన్ ఇవ్వడానికి ఇంకా ఎందుకు సంశయిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. మొన్నటి వరకూ విశాఖకు రైల్వే జోన్ ఇవ్వడానికి ఒడిశా అడ్డుపడుతోందని కేంద్రం కుంటి సాకులు చెపుతూ వచ్చిందని అవంతి అన్నారు. ఇప్పుడు ఒడిశా ఎంపీలు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విశాఖ కేంద్రంగా జోన్ ఇవ్వడానికి తమకేమీ అభ్యంతరం లేదని చెప్పినా, కేంద్రం ఎందుకు ఈ విషయంలో తాత్సారం చేస్తోందని ప్రశ్నించారు. భారతదేశంలో ఒడిశా ఒక్కటే రాష్ట్రం కాదని, ఏపీ కూడా భాగమేనన్న విషయాన్ని రైల్వే అధికారులు, కేంద్రం గుర్తించాలని అన్నారు. జోన్ ఇవ్వకుండా ఇకపై విశాఖలో ఇటువంటి సమావేశాన్ని ఇకపై నిర్వహించలేరని అవంతి హెచ్చరించారు. జోన్ ఇస్తామని చెప్పి బీజేపీ తమను నమ్మించి మోసం చేసిందని అన్నారు. ఏపీ ఎంపీల మనోభావాలను కేంద్రానికి తెలియచేయాలని జీఎం ఉమేష్ సింగ్‌కు అవంతి సూచించారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఒడిశా పాలనలో ఎంతకాలం తాము కొనసాగాలని ప్రశ్నించారు. రైలు బోగీల్లో ఎలుకలు, పందికొక్కులు తిరుగుతున్నాయి. చెడిపోయిన రైల్వే బోగీలను వాల్తేరు డివిజన్‌కు పంపించి, మంచి బోగీలు ఒడిశాలో వినియోగించుకుంటున్నారని అన్నారు. కొత్త రైళ్లు ఈ డివిజన్‌కు రావడం లేదని, ఉన్న రైళ్లను కూడా ఒడిశాకు తరలించుకుపోయే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు. ఎంపీ అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ భారతీయ రైల్వేలో వాల్తేరు డివిజన్ ఆర్థికంగా బలమైనదని విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తే, తమ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. విశాఖ ఎంపీ హరిబాబు మాట్లాడుతూ వాల్తేరు డివిజన్‌లో వౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశం మధ్యలో టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాసరావు, అశోక్‌గజపతిరాజు, రామ్మోహన్‌నాయుడు జోన్ ఇవ్వనందుకు నిరసనగా సమావేశం నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు. డీఆర్‌ం కార్యాలయం ఎదుట వీరు నిరసన ప్రదర్శన నిర్వహించారు.