రాష్ట్రీయం

ప్రగతి సాధకులా? నిరోధకులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణ ప్రగతిని అడ్డుకునే నిరోధకులు కావాలా? రాష్ట్ర ప్రగతి సాధనకు కృషి చేస్తున్న కేసీఆర్ నేతృత్వం కావాలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు తేల్చుకోవాలని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు శరవేగంగా తమ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే, ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్లి 186 కేసులు వేసిందని గుర్తు చేసారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలంతా కలిసికట్టుగా ఉద్యమాలు చేస్తుంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు మాత్రం పదవులను అనుభవించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలకు కాసులు, కమీషన్లు తప్ప ప్రజల గోస పట్టలేదన్నారు. తెలంగాణ అభివృద్ధి పథానికి విపక్షాలు అడ్డుపడుతుండటం వల్లనే ప్రజల తీర్పు కోసం ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. గడువు తీరకముందే అధికారాన్ని త్యాగం చేసి ఎన్నికలకు వెళ్తుంటే, కాంగ్రెస్ నాయకులేమో ఎన్నికలకు భయపడిపోతున్నారని ధ్వజమెత్తారు. రైతుబంధు అమలు చేసిన ముఖ్యమంత్రి ఒకవైపు ఉంటే, బషీర్‌బాగ్, ముదిగొండ కాల్పులలో రైతులను బలిగొన్న రాబందులు మరో వైపు ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. విద్యుత్ కోతల కాంగ్రెస్ ఒకవైపు, 24 గంటల నిరంత కరంట్ ఇచ్చిన టీఆర్‌ఎస్ మరొక వైపు ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలను అందించే తమ ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏలాంటి అంశం లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు చివరకు తమ కుటుంబాన్ని విమర్శించే స్థాయికి దిగజారన్నారు. గత ఎన్నికల్లో రెండున్నర కోట్లను కారులో తగలబెట్టిన చరిత్ర కాంగ్రెస్ నేతలదన్నారు. నీతులు చెప్పే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మహిళల అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తికి మద్దతు పలికే స్థాయికి దిగజారిపోయారని కేటీఆర్ మండిపడ్డారు. మహిళల అక్రమ రవాణాలో తప్పులేకపోతే ఆ విషయాన్ని సంగారెడ్డిలో మీటింగ్ పెట్టి ఎందుకు చెప్పలేకపోయారని కేటీఆర్ నిలదీసారు. వచ్చే ఎన్నికల్లో గంప గోవర్దన్‌ను గెలిపిస్తే, కామారెడ్డిని సిరిసిల్లాలా అభివృద్ధి చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.