రాష్ట్రీయం

ప్రజల కోసమే బాబ్లీ పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: గోదావరి నదిపై ప్రాజెక్టు మీద ప్రాజెక్టులు నిర్మిస్తే తెలంగాణ ప్రాంతం అన్యాయానికి గురవుతుందని, దాన్ని అడ్డుకోవడానికే ‘బాబ్లీ’ పోరాటం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా సున్నిపెంటలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మహారాష్టల్రోని బాబ్లీ ప్రాజెక్టు ఉద్యమానికి సంబంధించి నోటీసులు జారీ అయిన అంశంపై బాబు స్పందిస్తూ తానేమీ నేరాలు, ఘోరాలు చేయలేదని, ప్రజాహితం కోసమే బాబ్లీ ఉద్యమాన్ని చేపట్టానన్నారు. ఎనిమిదేళ్ల క్రితం బాబ్లీకి వ్యతిరేకంగా అక్కడే ఆందోళన చేయాలని వెళ్తుంటే సరిహద్దుల్లోనే అరెస్టు చేసి ఐదు రోజుల పాటు అనేక రకాలుగా హింసించారని గుర్తుచేశారు. ఆ తరువాత ఎలాంటి కేసులు లేవని వెళ్లిపోవాలని ఒకసారి, కేసులు నమోదు చేశాం బెయిలు తెచ్చుకోవాలని మరోమారు చెప్పి గందరగోళానికి గురిచేసి బలవంతంగా ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు తరలించారని ఆయన గుర్తుచేశారు. మళ్లీ ఇనే్నళ్లకు నోటీసులు జారీ అయ్యాయని ప్రచారం చేస్తున్నారన్నారు. నోటీసులు, అరెస్టు వారెంట్లపై ఏం చేయాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రజల కోసం పోరాడామే గానీ నేరం, ఘోరం చేయలేదని అన్నారు. తాను చేసే ప్రతి పని ప్రజలు, భావితరాల కోసమేనని ఆయన పేర్కొన్నారు. ఎవరి వల్ల ప్రజల ప్రయోజనాలు సమకూరాయో ఒక్కసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలను కోరారు. న్యాయపరమైన సలహాలతో బాబ్లీ కేసులను ఎదుర్కొంటామని చంద్రబాబు అన్నారు.