రాష్ట్రీయం

బాబుకు అరెస్టు వారెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: మహారాష్టల్రోని ధర్మాబాద్ కోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఒక ప్రాజెక్టు వద్ద ధర్నా చేపట్టిన కేసులో నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. ప్రభుత్వం గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షనేతగా చంద్రబాబు 2010లో ఆ ప్రాజెక్టు వద్ద ధర్నా చేశారు. ఈ కేసులో 15 మందికి ధర్నాబాద్‌లోని జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. ధర్మాబాద్ పట్టణం నాందేడ్ జిల్లాలో ఉంది. ఈ ఆదేశాలను ధర్మాబాద్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్‌మెజిస్ట్రేట్ ఎన్‌ఆర్ గజ్‌బాయ్ జారీ చేశారు.
ఈ కేసులో నిందితులందరినీ అరెస్టు చేసి ఈ నెల 21వ తేదీన కోర్టు ఎదుట హాజరుపరచాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. అప్పట్లో ఈ కేసులో ధర్నా చేసిన చంద్రబాబునాయుడు తదితరులను పోలీసులుఅరెస్టు చేసి పూణే జైల్లో ఉంచారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం వల్ల దిగువన ఉన్న తెలంగాణ ప్రాంత రైతుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతాయని టీడీపీ ఆరోపించింది. వాస్తవానికి కోర్టు గత నెల 5వ తేదీన ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. ఆ ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 16వ తేదీలోపల అమలు చేయాల్సి ఉంది. కాగా ఆ ఉత్తర్వులను స
రిదిద్ది సెప్టెంబర్ 21వ తేదీకి అమలు చేయాలని ఆదేశించారు. ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు, భారీసాగునీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే జీ కమలాకర్ ( ప్రస్తుతం టీఆర్‌ఎస్ నేత) తదితరులకు నాన్‌బెయిలబుల్ అరెస్టువారెంట్‌ను జారీ చేశారు. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) 1860 కింద చంద్రబాబు తదితరులపై దౌర్జన్యం, విధి నిర్వహణలో ఉన్న అధికారులను అడ్డుకోవడం, బెదిరించడం తదితర కేసులను నమోదు చేశారు. ఈ ఘటనలు జరిగిన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్నారు. ఈ విషయమై రాష్టమ్రంత్రి,చంద్రబాబుకుమారుడు నారా లోకేష్ స్పందించారు. ఈ కేసులో ధర్మాబాద్ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాల మేరకు సీఎం చంద్రబాబు తదితరులు కోర్టుకు హాజరవుతారన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం చంద్రబాబు పోరాడారన్నారు. గతంలో అరెస్టు చేసినప్పుడుబెయిల్ తీసుకునేందుకు నిరాకరించారన్నారు.