రాష్ట్రీయం

చరిత్ర సృష్టిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* యువనేస్తం వెబ్‌సైట్ ఆవిష్కరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, సెప్టెంబర్ 14: ‘యువతకు ప్రపంచాన్ని జయించే శక్తి ఉంది.మీ భవిష్యత్తుకు నేను భరోసా ఇస్తున్నా..ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదాగాలన్నదే నా ఆకాంక్ష’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఉండవల్లి ప్రజాదర్బార్‌లో శుక్రవారం రాత్రి నిరుద్యోగ భృతికి ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఇది ఓ చారిత్రాత్మక పథకం కానుంద’ని ఉద్ఘాటించారు. అనేక రాష్ట్రాల్లో పూర్తిగా సిద్ధం కాకుండా ఈ పథకాన్ని అమలు చేసి విఫలమయ్యాయని, ఎంతో ఆధ్యయనం తరువాత కసరత్తు జరిపి పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. తన మనస్సుకు దగ్గరైన ఏకైక కార్యక్రమం యువనేస్తం పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో నేటితరం యువతకు ప్రపంచాన్ని జయించే శక్తి రావాలన్నారు. అనేక ఆసియా దేశాల్లో యువ జనాభా తగ్గిపోతోందని, భారతదేశంలో వచ్చే మూడు దశాబ్దాల వరకూ యువతదే హవా అన్నారు. డిగ్రీలు ఎంతమందికి ఇచ్చామనేది కాదు.. ఎందరికి ప్లేస్‌మెంట్లు కల్పించాలనేదే ముఖ్యమన్నారు. అందరినీ యువనేస్తం ద్వారా ఒకే వేదికపైకి తెచ్చామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కట్టుబట్టలతో వచ్చామని, ఒక్కో మెట్టు విజన్‌గా ముందుకు సాగుతున్నామని ఉద్ఘాటించారు. యువతీ యువకులకు ఆకాశమే హద్దని, ప్రభుత్వం ఇస్తున్న వెయ్యి రూపాయలతో రాజీపడకుండా తమతమ ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చుకోవాలని పిలుపునిచ్చారు. దీనివల్ల 10 నుంచి 11 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తుందని తెలిపారు. స్వయం ఉపాధి, పోటీ పరీక్షలు, కంపెనీలు, ఆన్‌లైన్ సేవలు, శక్తివంతమైన యువసైన్యం రాష్ట్రానికి ఉందన్నారు. వారిని నైపుణ్యాలతో తీర్చిదిద్దుతామని పేర్కొన్న చంద్రబాబు ‘దేశంలో ఉత్తమ నిపుణులు మీకు శిక్షణ ఇస్తారు..శిక్షణ పొంది అవకాశాలు అందుకోవాలి’అని అన్నారు. ప్రభుత్వమిచ్చే వెయ్యి రూపాయలు పిల్లల ఖర్చులకు ఉపయోగపడతాయని, ఆర్థిక సాయంతో పాటు యువత విజ్ఞానానికీ తగిన గుర్తింపు తీసుకువస్తామని తెలిపారు. మంచి నైపుణ్యం పొందిన యువతకు అద్భుత అవకాశాలు రావాలనేది తన ఆకాంక్ష అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు నమ్మకం కుదిరింది. టెక్నాలజీతో రానున్న కాలంలో ఈజ్ ఆఫ్ లివింగ్ తీసుకొస్తామని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీలా విఫల కార్యక్రమాలు చేయకూడదు.. ఫలితాలు ఎలా ఉంటాయో బేరీజు వేసుకుని పనిచేయాలన్నారు. 2019 నాటికి ఏపీ ఇన్నోవేషన్ హబ్‌గా మారబోతోందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నేటి నుంచి భృతి రిజిస్ట్రేషన్లు
-------------------------------
దేశంలో ఇంత వరకు ఏ రాష్ట్రంలో అమలుకాని అద్భుతమైన పథకానికి ఆంధ్రప్రదేశ్ వేదిక అయ్యింది. నిరుద్యోగులకు బంగారు భవితపై భరోసా కల్పించే యువనేస్తం వెబ్‌సైట్ (డూబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.యువనేస్తం.ఏపీ.జీఒవి.ఇన్)ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ఉండవల్లి ప్రజావేదికలో లాంఛనంగా ప్రారంభించారు. నిరుద్యోగులకు నెలవారీ భృతి ఇవ్వటమే కాకుండా వారిలోని నైపుణ్యాలకు నగిషీలద్దటానికి, యువతకు వారికి ఇష్టమైన వివిధ రంగాల్లో అవసరమైన శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించటానికి ఈ వెబ్‌సైట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న పలు పరిశ్రమల యాజమాన్యాలతో ఇప్పటికే అధికారులు జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. పరిశ్రమల శాఖతో నిరుద్యోగ భృతి వెబ్‌సైట్‌ను అనుసంధానిస్తూ ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. నిరుద్యోగ భృతి వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయిన వాళ్లకు వారికి ఇష్టమైన మూడు రంగాల్లో ఏదో ఒక దాంట్లో శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొల్పిన, ఏర్పాటు కానున్న పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగులను కూడా ఈ శిక్షణ ద్వారా ఎంపికర చేయాలని నిర్ణయించారు. కొన్ని భారీ పరిశ్రమలు, కంపెనీల సహకారంతో అప్రంటీస్ చేయించటం ద్వారా ఆన్ జాబ్ ట్రైనింగ్‌కు ఏర్పాట్లు చేస్తుండటంతో పాటు ఒక జాబ్ పోర్టల్‌ను ఏర్పాటుచేసి నిరుద్యోగుల పూర్తి వివరాలను దేశంలోని అన్ని కంపెనీలకు అందుబాటులోకి తెస్తున్నారు. అదే విధంగా రాష్ట్రంలో నిరుద్యోగులకు కంపెనీలకు పరిశ్రమలకు సంయుక్తంగా ఉపయోగపడేలా ప్రత్యేక యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. ప్రజా సాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో సుమారు 12 లక్షల మంది నిరుద్యోగ భృతికి అర్హులుగా తేలింది. భృతి అమలు చేయటానికి సుమారు రూ 12 వందల కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తుంది. రెండేళ్ల డిప్లమో, డిగ్రీ ఆపై ఉన్నత విద్యాభ్యాసంచేసిన 22 నుంచి 35 సంవత్సరాల వయసు కల వారు యువనేస్తం వెబ్‌సైట్‌లో పేర్లను రిజిస్టర్ చేసుకునే వీలు కల్పించారు. ఇప్పటికే ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ ప్రావిడెంట్ ఫండ్ చెల్లిస్తున్న వారు కూడా నిరుద్యోగ భృతికి అర్హులు. రిజిస్టర్ చేసుకున్న అర్హులకు ప్రతినెలా మొదటి వారంలోనే వెయ్యి రూపాయల భృతి నేరుగా లబ్దిదారుల ఖాతాలో చేరుతుంది. అదే విధంగా ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చిన పరిశ్రమలకు కేటాయించిన భూముల ఆధారంగా వారు ఇచ్చిన ఎంప్లాయిమెంట్ పర్సంటేజిని పరిశీలన జరుపుతున్నారు. దీనికి సంబంధించి నాలుగున్నరేళ్లలో జిల్లాల వారీగా ఏర్పాటుచేసిన పరిశ్రమలు, కంపెనీలు ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు, ఇంకా ఇవ్వాల్సిన ఉద్యోగాల సమాచారాన్ని అధికారులు ఇప్పటికే సేకరించారు. దీనికి అనుగుణంగా యువనేస్తం వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయిన నిరుద్యోగులకు భృతితో పాటు ఉద్యోగాల కల్పనకు కృషి జరుగుతోంది.