రాష్ట్రీయం

ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రి సేవలు ప్రశంసనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ గత 20 సంవత్సరాలుగా మారుమూల ప్రాంతాల్లోని ప్రతి గడపకూ చేరుకుంటూ రోగికి కంటి సంరక్షణను అందిస్తూ అద్భుతమైన సేవలు అందిస్తున్నదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ (ఎల్విపిఇఐ) సామాజిక నేత్ర సంరక్షణా విభాగమైన ‘గుళ్ళపల్లి ప్రతిభారావు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ రూరల్ ఐ కేర్ (జిపిఆర్‌ఐకేర్) ఈ సంవత్సరం 20 వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కేంద్ర మంత్రి నడ్డా ప్రసంగిస్తూ కంటి సమస్యలో 80 శాతం వరకు చికిత్స అందించవచ్చన్నారు. పేదలకు కూడా ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం చేపట్టిన నేషనల్ హెల్త్ ప్రొగ్రాం అనేది ఒక గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా లక్షా 50 వేల ఉప కేంద్రాలు ప్రజారోగ్య కేంద్రాలు వెల్‌నెస్ సెంటర్లుగా మారనున్నాయని ఆయన తెలిపారు.
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ ఎల్‌వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ రెండు దశాబ్దాలు పూర్తిచేసుకున్నందుకు సంతోషంగా ఉందని అంటూ మున్ముందు కూడా ఇదేవిధంగా సేవలందించాలని ఆకాంక్షించారు. ఎల్‌వి ప్రసాద్ ఇనిస్టిట్యూట్ చైర్ డాక్టర్ గుళ్ళపల్లి ఎన్.రావు మాట్లాడుతూ ఎల్‌విపిఇఐ యొక్క జిపిఆర్ ఐ కేర్ విలేజ్ విజన్ కాంప్లెక్స్ అనేది ప్రపంచానికి ఒక నమూనాగా ఉన్నదన్నారు.