రాష్ట్రీయం

చరిత్రను వక్రీకరిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ఒకవైపు అధికారం అనుభవిస్తూ, మరోవైపు చరిత్రను టీఆర్‌ఎస్ వక్రీకరిస్తోందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మజ్లిస్ చేతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలుబొమ్మగా మారారని విమర్శించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జాతీయ జండాను ఎగురవేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, సీనియర్ నేతలు జీ. కిషన్ రెడ్డి, ఎన్. రామచందర్ రావు, పేరాల శేఖరరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేది లేదని తేల్చి చెప్పడం
యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానపరచడమేనని అన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా టీఆర్‌ఎస్ ఎంఐఎం ఒత్తిడికి లొంగడాన్ని ప్రజలు సహించరని అన్నారు. బలిదానాలను పాఠ్యాంశాలుగా చేర్చి భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, నాటి పోరాటాలు వెలుగులోకి రాకుండా కుట్ర పూరితంగానే గత ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించడం లేదని అన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. త్యాగాలతో , బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం అధికారం అనుభవిస్తూ చరిత్రను వక్రీకరిస్తోందని ఎద్దేవా చేశారు. బీజేపీపై ఇష్టాను సారం విమర్శలు చేయడం అభ్యంతరకమని అన్నారు. బీజేపీనీ ఝూటా పార్టీ అంటూ, తమ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కించపరిచేలా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పాలన చూస్తుంటే అది తెలంగాణ రాబందుల సమితిలా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.