రాష్ట్రీయం

పరిశీలనలో అభ్యర్థుల జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితా పార్టీ స్క్రీనింగ్ కమిటీ పరిశీలనలో ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పొత్తుల అంశం తేలకుండా పార్టీ అభ్యర్థులను ప్రకటించడం సాధ్యం కాదని అన్నారు. పార్టీ ఎన్నికల కమిటీల నియామకం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరిశీలనలో ఉన్నదని అన్నారు. వివిధ కమిటీల నియామకాల్లో జరుగుతున్న జాప్యంపై మాట్లాడుతూ, తాను కూడా రాహుల్ దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. పొత్తుల అంశంపై వివిధ పార్టీలతో ప్రాథమిక చర్చలు మాత్రమే జరిగాయని ఉత్తమ్ అన్నారు. పొత్తులు ఉన్నా, పక్కాగా గెలుపొందే సీట్లను తాము వదులుకోబోమని ఆయన స్పష్టం చేశారు. మహాకూటమికి ఎవరు నాయకత్వం వహించాలనేది మిగతా పక్షాలతో చర్చించిన తర్వాతే నిర్ణయిస్తామన్నారు. కూటమికి ఉమ్మడి అజెండా ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు ఉత్తమ్ తెలిపారు.