తెలంగాణ

అబ్బురపరచిన వైమానిక విన్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనలో భాగంగా బుధవారం హైదరాబాద్‌లో బేగంపేట విమానాశ్రయంలో నిర్వహించిన వైమానిక విన్యాసాలు ప్రజలను అబ్బుర పరచాయి. ఈ ప్రదర్శనను భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. నగరంలో ఐదవ సారి జరుగుతున్న విమానాల పండగలో బ్రిటన్‌కు చెందిన విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విమానాశ్రయంలో మొదటి రోజు జరిగిన విన్యాసాల్లో నాలుగు విమానాలు పాల్గొన్నాయి. బ్రిటన్‌కు చెందిన మార్క్ జెఫ్రీస్ బృందం గగుర్పాటు విన్యాసాలు కవ్వించి, నవ్వించి ఆనందాశ్చర్యంలో ముంచెత్తాయి.
విమానాలు 90 డిగ్రీల కోణంలో నిటారుగా గగనతలంలో పల్టీలు కొడుతూ.. కిందకు వచ్చిన తీరు.. అతివేగంగా భూమికి తాకుతుందా అని అనిపించే విధంగా పైకి తేలిపోతున్న తీరు సందర్శకులకు గగుర్పాటు కలిగించింది. ఈసారి ఇండియా ఏవియేషన్‌లో 8ఎయిర్ క్రాఫ్ట్‌లతోపాటు 6 యులిటీ టర్బో ప్రాప్స్, 4 విటిలిటీ హెలికాప్టర్లు, 8 బిజెనెస్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, మరో నాలు ఎరోబొటిక్ ఎయిర్ క్రాఫ్ట్‌లు ప్రదర్శనలో పాల్గొంటున్నాయని ఫిక్కి అధ్యక్షుడు హర్షవర్ధన్ తెలిపారు. కాగా బుధవారం 330 ఎస్‌సి ఎయిర్ క్రాఫ్ట్‌ల విన్యాసాల్లో నలుగురు బ్రిటిష్ పైలెట్లు మార్క్‌జెఫ్రీస్, టామ్ కాస్సాల్స్, కెస్ బర్కట్, స్తీవ్ కార్వర్, మైఖేల్ జికిన్, గ్లోబల్ స్టార్స్ వీరం ఎరోబొటిక్ టీమ్‌లో ఉన్నారు. ఫార్మెషన్స్ సోలోతో 10 నిమిషాలు ఆకాశంలో చేసిన విన్యాసాలు సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తాయి. ఈ విన్యాసాలు మరో నాలుగు రోజులుంటాయని నిర్వాహకులు తెలిపారు. బోయింగ్ 777 ఎయిర్ ఇండియా, డార్నియర్ హెచ్‌ఎఐ, టాక్-003 (త్రష్ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ) ఎంఐ-172 పవాన్ హంస్, ఏ 350 ఖతర్ ఎయిర్ వేస్, ఏ0330-300 ఆసియా, 500, 650 లెగస్సీ, ఫెనామ్ 200 (బిజెనెస్ జెట్), బోయింగ్ 787, 380 ఎమిరాట్స్ వంటి విమానాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి.

వచ్చే నెలలో కొత్త పౌర విమానయాన విధానం

కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు వెల్లడి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 16: వచ్చే నెలలోనే కొత్త జాతీయ పౌర విమానయాన విధానాన్ని ప్రకటించనున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, కొత్త విధానంలో విమానాల మెయింటెనెన్స్, మరమ్మత్తులు, ఆపరేషన్ల వ్యవస్ధకు పెద్ద పీట వేయనున్నట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో సాలీనా 20 చొప్పున వంద కొత్త విమాన సర్వీసులను నడిపే విధంగా కొత్త విధానాన్ని ఖరారు చేస్తామని, దీనికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉందన్నారు. ఎయిర్ ఇండియా ఏ ఆర్ధిక సంస్ధకు బకాయి పడలేదని చెప్పారు. ఈ ఏడాది తొలిసారిగా ఎయిర్ ఇండియా సంస్ధ ఆపరేషన్ లాభాలను సాధించనుందన్నారు. 2019 నాటికి పూర్తి లాభాల బాటలో నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియాకు సాలీనా రూ.2500 కోట్ల నిధులను సహాయంగా ఇస్తున్నామన్నారు. 1.3 బిలియన్ల మంది ఉన్న భారత్‌లో వచ్చే ఏడాదికి 350 మిలియన్ల మంది మధ్య తరగతి ప్రజలు ఉంటారని, వీరిని దృష్టిలో పెట్టుకుని కొత్త విమానాశ్రయాలు, తక్కువ చార్జీకే విమానసర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తును చేపట్టామన్నారు. వచ్చే నెలలో ప్రకటించే విధానంలో ఇవన్నీ ఉంటాయన్నారు. దేశంలో కొచ్చిన్, బెంగళూరు, హైదరాబాద్‌లో మూడు ప్రైవేట్ విమానాశ్రయాలు, ఢిల్లీ, ముంబాయిలో సంయుక్త రంగంలో విమానాశ్రాయాలు ఉన్నాయని, ఎయిర్ ఇండియా అథారిటీ ఆధ్వర్యంలో 127 విమానాశ్రయాలు, 160 ఎయిర్ స్ట్రిప్స్ ఉన్నాయన్నారు. కొత్తగా ఎయిర్ స్ట్రిప్స్ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కొత్తగా 75 విమానాశ్రయాల ఏర్పాటుకు ఒక విధానాన్ని ఖరారు చేస్తామన్నారు.