రాష్ట్రీయం

రాహుల్‌పైనే ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్నూలు పర్యటనపై ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఆశలు పెంచుకుంటున్నారు. ‘సత్యమేవ జయతే’ పేర కర్నూలులో మంగళవారం నిర్వహించనున్న బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రజలకు భరోసా ఇవ్వనున్నారని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఆయన సభ తరువాత ప్రజల ఆలోచనలో మార్పురావడం ఖాయమని, తిరిగి తమను ఆదరిస్తారన్న విశ్వాసంతో నాయకులు ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో ప్రజాగ్రహానికి గురైన పార్టీ మళ్లీ ప్రజల్లోకి వెళ్లి రాష్ట్రానికి న్యాయం చేసే శక్తి ఒక్క కాంగ్రెస్‌కే ఉందంటూ వారి మన్ననలు పొందేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. విభజన హామీలే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏం చేయాలో అన్ని చేస్తామని ప్రకటిస్తోంది. విభజన హామీలు, చట్టంలో పేర్కొన్న అంశాలన్నింటినీ తాము భర్తీ చేస్తామని ఏకంగా సీడబ్ల్యూసీలో తీర్మానం చేయించి కర్నూలులో రాహుల్ సభ ఏర్పాటు చేశారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో రాష్ట్రానికి తొలిసారి వస్తున్న రాహుల్ గాంధీ కర్నూలులో
నిర్వహించే సభకు ‘సత్యమేవ జయతే’ అని నామకరణం చేశారు. అసత్యాలు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీని ఓడించేందుకే కర్నూలు సభకు సత్యమేవ జయతే అని నామకరణం చేశామని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ సభ ద్వారా ఆ పార్టీ జాతీయ ఎన్నికల హామీలతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తాము చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్నారని ఆయన తెలిపారు. జాతీయ స్థాయిలో రైతులు తీసుకున్న రుణాలు రూ.2 లక్షల వరకు ఒకేసారి మాఫీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. యువతను ప్రోత్సహించడానికి 35 ఏళ్ల వరకు వారి సంపాదనకు ఎలాంటి ఆదాయ పన్ను వసూలు చేయబోమని స్పష్టం చేస్తున్నారు. హోదాపై తొలి రోజే అధికారిక ప్రకటన జారీ చేస్తామని, ఇతర హామీలు, విభజన చట్టంలోని అన్ని అంశాలతో పాటు రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం తీసుకోవాల్సిన అన్ని చర్యలను స్వల్పకాలంలోనే చేసి తీరుతామని ప్రజలకు వివరిస్తున్నారు.
ఇక రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పొదుపు మహిళలు తీసుకున్న రుణాల మాఫీతో పాటు ఆ తరువాత వారికి వడ్డీ లేకుండా కొత్త రుణాలు ఇస్తామని పేర్కొంటున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ నాయకులు వెల్లడిస్తున్నారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది తామేనని, మళ్లీ అధికారంలోకి వస్తే దాన్ని 8 శాతానికి పెంచుతామని హామీ ఇస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇస్తున్న పెన్షన్ మొత్తాన్ని రూ.2 వేల నుంచి రూ.2,500కు పెంచుతామని, నిరుద్యోగ భృతినిరూ.మూడు వేలు చేస్తామని ప్రచారం చేస్తున్నారు. వీటన్నింటినీ కర్నూలు సభలో రాహుల్ గాంధీ ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
రాహుల్ సభ విజయవంతానికి కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్య ప్రకాశరెడ్డి భారీ కసరత్తు చేశారు. జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కొత్తగా పార్టీలో చేరిన నాయకులతో సమావేశం నిర్వహించి గత 20 రోజులుగా నిర్విరామంగా తిరిగారు. రాహుల్ సభకు లక్ష మందికి పైగా జనాన్ని సమీకరించాలని ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. రాహుల్ సభను విజయవంతం చేయడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తు వేసింది. పార్టీ బలపడితే అధికారంలోకి రావడం అంత కష్టమేమీ కాదని ధీమాతో ఉన్నారు.

చిత్రం..మధ్యప్రదేశ్‌లో సోమవారం కాంగ్రెస్ ర్యాలీలో ఏర్పాటు చేసిన పార్టీ సీనియర్ నేతల కటౌట్లు