రాష్ట్రీయం

శేషవాహనంపై గణనాథుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాల, సెప్టెంబర్ 17: చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శేషవాహనంపై వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఈకార్యక్రమానికి కాణిపాకం, వడ్రాంపల్లి, మిట్ట ఇండ్లు, కొత్తపల్లి, బొమ్మసముద్రం, అడపగుండ్లపల్లి, తిమ్మోజపల్లి, తివరువణంపల్లి, చిగర్లపల్లి, నగరంపల్లి గ్రామాలకు చెందిన కమ్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈసందర్భంగా ప్రధాన ఆలయాన్ని స్వర్ణ్ధ్వజస్థంబాన్ని, సుభద్ర మండపాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఉదయం మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సిద్ధిబుద్ధి సమేత వినాయకస్వామివారి ఉత్సవ మూర్తులను చిన్నశేషవాహనంపై ఉంచి కాణిపాకంలో ఊరేగించారు. అలాగే రాత్రి అలంకార మండపంలో స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక పుష్పాలతో అలంకరించి బంగారు పెద్దశేషవాహనంపై కాణిపాకం మాడా వీధుల్లో అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలతో, మంగళ వాయిద్యాలు, మేళ తాళాల మధ్య భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. ఈకార్యక్రమంలో ఈవో పూర్ణచంద్రరావు, ఏసి వెంకటేష్, చైర్మన్ సురేంద్రబాబు, పలువురు భక్తులు పాల్గొన్నారు. అష్టోత్తర కలశ ఊరేగింపు, శేషవాహన సేవను పురస్కరించుకొని వాహన ఉభయదారులు, భక్తులు కాణిపాకం పురవీధుల్లో ఉదయం చిన్న శేషవాహనం వెంట పాలతో నిండిన అష్టోత్తర శత కలశాలను ఊరేగించారు. అలంకార మండపం సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవ మూర్తులకు వైభవంగా పాలతో అభిషేకం నిర్వహించారు.

చిత్రం..కాణిపాకం పుర వీధుల్లో శేషవాహనంపై విహరిస్తున్నమూషిక వాహనుడు