రాష్ట్రీయం

మీ రాష్ట్రానికి దేశం రుణపడి ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 18: రాష్ట్ర ప్రజలపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ దేశం ఆంధ్రప్రదేశ్‌కు రుణపడి ఉందని కొనియాడారు. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించిన సత్యమేవ జయతే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ దామోదరం సంజీవయ్య, కోట్ల విజయ భాస్కరరెడ్డి, పీవీ నరసింహారావు, నీలం సంజీవరెడ్డి వంటి నాయకులను దేశానికి అందించిన తెలుగు ప్రజల రుణం కేంద్రం తీర్చుకోవాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళలు ఏకతాటిపైకి వచ్చి పొదుపు చేస్తూ తమకంటూ ఒక ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని దేశానికి మార్గదర్శకంగా నిలిచారని రాహుల్ ప్రశంసించారు. తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడినయ్యాక రాష్ట్రంలో తొలి సభ ఎక్కడ నిర్వహించాలన్న ఆలోచన వచ్చినపుడు రాష్ట్రానికి ఇద్దరు నిజాయితీపరులైన ముఖ్యమంత్రులను అందించి ఘనత సాధించిన కర్నూలులోనే ఏర్పాటుచేయాలని నిర్ణయించామన్నారు. దామోదరం
సంజీవయ్య, కోట్ల విజయ భాస్కరరెడ్డి సమాధులు, వారు నివసించిన ప్రాంతాలను సందర్శించి వారికి నివాళులు అర్పించడం తనకు దక్కిన అదృష్టంగా అభివర్ణించారు. వారిద్దరినే కాకుండా అనంతపురం జిల్లాకు చెందిన నీలం సంజీవరెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన పీవీ నరసింహారావును అక్కున చేర్చుకుని కర్నూలు ప్రజలు ఒకరిని రాష్టప్రతిగా, మరొకరిని ప్రధానమంత్రిని చేయడం అంటే నిజాయితీపరులు ఎక్కడ ఉన్నా తాము వారికి అండగా నిలబడతామని చెప్పడమేనన్నారు.
దామోదరం స్మారక మందిరం నిర్మిస్తాం
దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నివాసం ఉన్న కర్నూలు జిల్లా పెదపాడు గ్రామంలోని ఆయన పాత ఇంటి స్థానంలో ఒక స్మారక మందిరం నిర్మిస్తామని రాహుల్ ప్రకటించారు. పెదపాడు గ్రామంలో సంజీవయ్య నివసించిన గృహాన్ని రాహుల్ మంగళవారం సందర్శించారు. అక్కడ దామోదరం సంజీవయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం దామోదరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దామోదరం స్మారక మందిరం నిర్మాణానికి అవసరమైన భూమిని ఏఐసీసీకి దాఖలు చేస్తూ సిద్ధం చేసిన డాక్యుమెంట్లను వారి నుంచి పొందారు. దామోదరం కుటుంబానికి అవసరమైన సహాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కోట్ల విజయ భాస్కరరెడ్డి అందరికీ ఆదర్శం
పెదపాడు నుంచి కర్నూలు చేరుకున్న రాహుల్ నగరంలోని మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కరరెడ్డి సమాధి కిసాన్‌ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కోట్ల ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పెద్దల నిజాయితీని ఆదర్శంగా తీసుకోవాలన్న ఉద్దేశంతో వారికి నివాళి అర్పించి, ఆశీస్సులు పొందానన్నారు. కోట్ల చూపిన బాటలో ఆయన కుమారుడు కోట్ల సూర్య ప్రకాశరెడ్డి పయనిస్తూ నిజాయితీగా ఉండటం సామాన్యమైన విషయం కాదని స్పష్టం చేశారు. దామోదరం సంజీవయ్య, కోట్ల విజయ భాస్కరరెడ్డి మాదిరి నిజాయితీగా ఉంటే మనలను కూడా ప్రజలు గుండెల్లో దాచుకుంటారని స్పష్టం చేశారు.

చిత్రం..కర్నూలు జిల్లా పెదపాడు గ్రామంలో
దామోదరం సంజీవయ్య చిత్రపటానికి నివాళులర్పిస్తున్న రాహుల్ గాంధీ