రాష్ట్రీయం

ఎంపీ పొంగులేటి ఇళ్లపై ఐటీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్ళు, కార్యాలయాలపై మంగళవారం ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. హైదరాబాద్, ఖమ్మంల్లోని కార్యాలయాలు, ఇళ్ళతో పాటు ఆయన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలోని ఇంటిపై కూడా దాడులు చేశారు. అలాగే ఆయనకు సన్నిహితంగా ఉండే పలువురు కాంట్రాక్టర్ల ఇళ్ళపై కూడా సోదాలు నిర్వహించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కనస్ట్రక్షన్స్ పేరుతో కాంట్రాక్ట్ పనులు కూడా చేస్తుంటారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పలు పనులను ఆయన సంస్థ చేస్తోంది. పొంగులేటి సోదరుడైన ప్రసాద్‌రెడ్డి వీటిని పర్యవేక్షిస్తుంటారు. తొలుత కాంట్రాక్టర్‌గానే ఉన్న పొంగులేటి గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి తరువాత అధికార టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుండి పార్టీ అప్పగించిన ఏ పనినైనా ఖర్చుకు వెనుకాడకుండా పూర్తి చేస్తారని పేరు సంపాదించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రగతి నివేదన సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 2వేల ట్రాక్టర్లను తీసుకువెళ్ళారు. ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడులు జరగటం ప్రాధాన్యతను సంతరించుకుంది.