రాష్ట్రీయం

అసమ్మతిపై తెరాస ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: వచ్చే ఎన్నికల్లో పోటీకి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించిన అభ్యర్థులలో చేర్పులు, మార్పులకు అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. అయితే ఈ చేర్పులు, మార్పులు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతనే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను 14 స్థానాలను మాత్రమే మినహాయించి 105 స్థానాలకు టీఆర్‌ఎస్ తన అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకటించాల్సిన వాటిలో ఐదు స్థానాలు మిత్రపక్షం ఎంఐఎంకు చెందిన 5 స్థానాలను మినహాయిస్తే మిగిలేది 9 మాత్రమే. దీంతో దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం ఇప్పట్లో ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తొలి విడతలో ప్రకటించిన అభ్యర్థులలో కొందరిపై పెల్లుబికిన అసమ్మతి పూర్తిగా సమసిపోయిన తర్వాతనే రెండవ విడత జాబితా ప్రకటించాలని అధిష్టానం భావిస్తోన్నట్టు సమాచారం. అభ్యర్థులు మారే అవకాశం ఉన్న వాటిలో ఉప్పల్, స్టేషన్ ఘన్‌పూర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వరంగల్ ఈస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖ తనకు టికెట్ ప్రకటించకపోవడం పట్ల అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన విషయం తెలిసిందే. 24 గంటల్లో తనకు టికెట్ ఇచ్చేది లేనిదీ స్పష్టం చేయాలని కూడా సురేఖ అల్టిమేటం విధించారు. కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేసుకుని అధిష్టానంపై కొండా సురేఖ విరుచుకుపడిందని పార్టీ భావిస్తోంది. అల్టిమేటంపై స్పందిస్తే టికెట్ ఆశించిన వారంతా కొండా మాదిరిగానే పార్టీపై విమర్శలు చేసే అవకాశం లేకపోలేదని పార్టీ భావిస్తోంది. పార్టీలో అసమ్మతికి ఆస్కారం లేకుండా సురేఖకు టికెట్ ప్రకటిస్తే ఎలా ఉంటుందనే కోణంలో కూడా అధిష్టానం యోచించినట్టు తెలిసింది. ఒకవేళ టీఆర్‌ఎస్ టికెట్ ప్రకటించాక, టీఆర్‌ఎస్ టికెట్‌ను తిరస్కరిస్తున్నట్టు కొండా ప్రకటిస్తే పార్టీ పరువు పోయే ప్రమాదం ఉందని కూడా అధిష్టానం అంచనా వేసినట్టు తెలిసింది. కొండా సురేఖ ఉదంతంపై పార్టీ సీనియర్లతో అధినేత కేసీఆర్ చర్చించినట్టు తెలిసింది.
ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా నేతల అభిప్రాయం కోరగా, వారంతా సురేఖ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్టు సమాచారం. మహిళా, బీసీ నాయకురాలన్న సానుభూతితో టికెట్ ఇచ్చినట్లయితే భవిష్యత్‌లో టీఆర్‌ఎస్ అధిష్టానమే దిగివచ్చిందని ఆమె ఎవరినీ ఖాతరు చేయదని వారు కేసీఆర్‌కు వివరించినట్టు తెలిసిందే. పైగా సురేఖ బ్లాక్‌మెయిల్‌కు టీఆర్‌ఎస్ అధిష్టానం లొంగిపోయిందన్న సంకేతాలు పార్టీని బలహీనపర్చే అవకాశం ఉందని విశే్లషించినట్టు తెలిసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మిగిలిన స్థానాలకు, ప్రకటించిన స్థానాల అభ్యర్థులలో చేర్పులు, మార్పులకు అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం.