రాష్ట్రీయం

ఐక్యంగా పనిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ‘అందరూ ఐక్యంగా పని చేయండి... ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోండి’ అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ తెలంగాణ నాయకులకు పిలుపునిచ్చారు. కర్నూలులో మంగళవారం ఏపీసీసీ ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం ఢిల్లీ వెళ్ళేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయం ఆవరణలోని వీఐపీ లాంజ్‌లో రాహుల్ గాంధీతో పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్‌పీ తాజా మాజీ నాయకుడు కే జానారెడ్డి, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రభృతులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఎన్నికల పొత్తులు, అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో, ప్రచార కార్యక్రమాలు, రాష్ట్రంలో పార్టీ పనితీరు అదితర అంశాలపై ఆరా తీశారు. వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు ముందుకు వస్తున్న వారి గురించి రాహుల్ వాకబు చేశారు. ఏయే పార్టీలతో పొత్తులు కుదుర్చుకోనున్నారు?, ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించనున్నారు? పొత్తుల వల్ల కలిగే లాభనష్టాల వంటి అంశాలపైనా కాంగ్రెస్ అధ్యక్షుడు చర్చించారు. పొత్తుల విషయంలో ఇక ఏ మాత్రం జాప్యం చేయరాదన్నారు. జాప్యం చేస్తే ప్రచారానికి సమయం సరిపోక, నష్టం జరుగుతుంది కాబట్టి త్వరగా తేల్చేయాలని ఆయన సూచించారు. అధికార పార్టీ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ముందుకెళ్ళాలని, అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, గెలుపొందేందుకు అన్ని అవకాశాలు ఉన్న అభ్యర్థులను
ఎంపిక చేయాలన్నారు. ముఖ్యంగా , మైనారిటీ, మహిళలకు తగు సంఖ్యలో అభ్యర్థులను ఎంపిక చేసి స్క్రీనింగ్ కమిటీకి జాబితా అందించాలని ఆయన ఆదేశించారు. ప్రచారానికి అన్ని హంగులతో సన్నద్ధం కావాలని, ఎన్నికల ప్రణాళికలో ఆచరణ సాధ్యమయ్యే హామీలనే ఇవ్వాలని నొక్కిచెప్పారు. ఇందుకు అవసరమైన కమిటీలను త్వరితగతని ఏర్పాటు చేసుకోవాలని, ప్రచారానికి తానూ తరచూ వస్తుంటానని రాహుల్ స్పష్టం చేశారు.‘మీరు అంతా కలిసి ఐక్యంగా ముందుకు సాగండి. ఐక్యత లేకపోవడం వల్లే గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ నష్టపోయింది’అని ఆయన అన్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు ముందుకు వచ్చే వారిని చేర్చుకోవాలని, ఆ తర్వాత వారికి తగు విధంగా గుర్తింపును ఇద్దామని రాహుల్ అన్నట్లు సమాచారం.