రాష్ట్రీయం

వృషభ వాహనంపై ఊరేగిన గణేశుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాల, సెప్టెంబర్ 18: చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి వారు వృషభ వాహనంపై అధిరోహించి కాణిపాకం మాడావీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. ఈ వాహన సేవకు కాణిపాకం, సంతపల్లి, మారేడుపల్లి, ముదిగోళం, చిత్తూరు శాలివాహన వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉద యం కాణిపాకం ఆర్యవైశ్యులు మూలవిరాట్‌కు అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేశారు.

చిత్రం.. కాణిపాకం వీధుల్లో వృషభ వాహనంపై ఊరేగుతున్న పార్వతీ తనయుడు