రాష్ట్రీయం

చిర్రెత్తిన చెంచులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పి.వి. రమణారావు
హైదరాబాద్, సెప్టెంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వంపై నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న చెంచులు తిరుగుబాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతాన్ని ‘పులుల అభయారణ్యం’గా గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఇదే అడవిలో ఎకో టూరిజం పేరుతో నగర ప్రజలు వాహనాల్లో స్వేచ్ఛగా సంచరిచేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నాగర్‌కర్నూలు జిల్లాలోని లింగాల మండలం, అమ్రాబాద్ మండలాల్లోని లింగభేరీ చెంచుపెంట, సంగెట గుండాల, పందిబొర్ర, మేడిమల్కల, రాంపూర్, అప్పాపూర్, పుల్లాయపల్లి, భౌరాపురం తదితర చెంచుగూడెంలలో నివసిస్తున్న చెంచులు ఎకో టూరిజాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎకో టూరిజం చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని చెంచులంతా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. చెంచులను సముదాయించేందుకు నల్లమల అటవీప్రాంతంలోని మేడిమల్కల చెంచుగ్రామంలో అటవీ అధికారులు, ఐటీడీఏ అధికారులు గురువారం సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అధికారుల ప్రవర్తనతో విసుగెత్తిన చెంచులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వం భయపెట్టినా, అనుననియించినా అటవీ ప్రాంతంలో తమ జీవనానికి భంగం కలిగించే ఎలాంటి చర్యలను అనుమతించబోమని మేడిమల్కల చెంచుగూడేనికి చెందిన ఎన్. బయ్యన్న స్పష్టం చేశారు. బయ్యన్న బుధవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, గిరిజనుల సంస్కృతీ, సాంప్రయాలను, మనోభావాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. తమ హక్కులకు భంగం కలిగితే సహించబోమని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిలో అటవీ అధికారులకు, చెంచులకు మధ్య ఘర్షణ చోటు చేసుకునే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. చెంచులకు సంస్కృతీ, సాంప్రయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడం మంచిదని స్వచ్ఛంద సేవా సంస్థ ‘చెంచులోకం’ గౌరవాధ్యక్షుడు డాక్టర్ డి. రాంకిషన్ ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు.
నల్లమల అటవీప్రాంతంలోని కదలీవనం, దత్తాత్రేయుని పాదాలు, సలేశ్వరం తదితర ప్రాంతాలు చెంచులకు ప్రధానమైన పుణ్యక్షేత్రాలు. ఈ ప్రాంతాల్లో ఎకో టూరిజం పేరుతో హోటళ్లు తదితర నిర్మాణాలు చేపట్టాలని అటవీశాఖ భావిస్తోంది. ఈ ప్రాంతాలకు రోడ్డు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్ నుండి శ్రీశైలం వరకు ఉపయోగిస్తున్న రాష్ట్ర రోడ్డుపై (హైదరాబాద్ నుండి దాదాపు 110 కిలోమీటర్ల దూరం) ఉన్న ఫరహాబాద్ గేట్ నుండి నల్లమల అటవీ ప్రాంతలోని చెంచుపెంటలకు రోడ్డు వేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఫరహాబాద్ (పులిగుర్తు ఉన్న ప్రాంతం) నుండి దాదాపు 26 కిలోమీటర్ల వరకు రోడ్లు వేశారు. భౌరాపురం, మేడిమల్కల వరకు కంకరరోడ్డు ఉంది. మేడిమల్కల నుండి కదలీవనం, దత్తాత్రేయుని పాదాల వరకు రోడ్డు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోడ్డుకోసం 285 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం మంజూరు చేసిందని అటవీశాఖ అధికారవర్గాలు తెలిపాయి. రోడ్డుపనులకోసం ట్రాక్టర్లు, ప్రొక్లేయినర్లు తదితర భారీ యంత్రాలను అటవీ ప్రాంతానికి తరలించారు. ఈరోడ్డు వేస్తే చెంచుల జీవితానికి ప్రమాదం ఏర్పడుతుందని, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. రోడ్లు వేయడాన్ని గత వారంరోజుల నుండి చెంచులు అడ్డుకుంటున్నారు. అటవీప్రాంతాల్లో ఉండే చెంచులకు అటవీహక్కుల చట్టం, ఉమ్మడి హక్కుల చట్టం, పీసా, 1/70 ప్రకారం హక్కులు ఉన్నాయి. వాస్తవంగా గిరిజనులు అంటే చెంచులే. గిరిజనుల జీవన విధానం సాధారణ ప్రజల జీవన విధానికి భిన్నంగా ఉంటుంది. పులులు, సింహాలు, చెరుతలు, ఎలుగుబంట్లు తదితర జంతువులతో పాటు పాములు తదితరాలతో చెంచులు సహజీవనం సాగిస్తుంటారు. అటవీ జంతువులను తమ కుటుంబ సభ్యులుగానే వారు భావిస్తుంటారు. అటవీ జంతువులు కూడా చెంచులకు ఎలాంటి హానీ చేయడం లేదు. ఈ పరిస్థితిలో ఎకో టూరిజం పేరుతో తమ సంస్కృతి, సాంప్రదాయాలకు అటవీ అధికారులు విఘాతం కల్పిస్తున్నారంటూ చెంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నెలరోజుల పాటు ఆపండి
ఎకో టూరిజానికి సంబంధించిన పనులను నెలరోజుల పాటు ఆపివేయాలంటూ చెంచులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నల్లమల ప్రాంతంలోని అన్ని చెంచుగూడెంలలో ఉంటున్న తామంతా కలిసి చర్చించుకుంటామని బయ్యన్న తదితరులు తెలిపారు. అడవి జంతువులకు కూడా ఇప్పుడు సంతానోత్పత్తి కాలమని, యంత్రాలు తీసుకువచ్చి అటవీ జంతువులను భయబ్రాంతులకు గురి చేయవద్దని చెంచులు కోరుతున్నారు.

చిత్రం..దత్తాత్రేయుని పాదాలున్న అటవీ ప్రాంతంలో జలపాతం