రాష్ట్రీయం

ముహూర్తమే ముంచింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: పుష్కరాల్లో ముహూర్త సమయానికే గోదావరిలో మునకేయాలన్న మూఢ నమ్మకంతో భక్తులు దూసుకురావడం వల్లే తొక్కిసలాట తలెత్తిందని జస్టిస్ సీవై సోమయాజులు కమిటీ తేల్చింది. ముహూర్త కాలంపై జరిగిన దుష్ప్రచారమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్‌లో 2015 జూలై 14న జరిగిన తొక్కిసలాటలో 27మంది ప్రాణాలో కోల్పోగా, 50 మందికి గాయాలయ్యాయి. ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలో కమిటీని నియమించింది. ప్రత్యక్ష సాక్షులు, విధి నిర్వహణలో వివిధ శాఖల అధికారులు, బాధితులు, మృతుల కుటుంబాల నుంచి కమిటీ వివరాలను సేకరించి నివేదికను రూపొందించింది. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ అందజేసిన అఫిడవిట్‌ను జత చేస్తూ 17 పేజీలతో కూడిన నివేదికను కమిటీ ప్రభుత్వానికి అందించింది. దీనిపై ఈ నెల 5న జరిగిన మంత్రి మండలి సమావేశంలో చర్చించిన అనంతరం అసెంబ్లీ
వర్షాకాల సమావేశాల్లో చివరి రోజైన బుధవారం మంత్రి పితాని సత్యనారాయణ సభలో ప్రవేశపెట్టారు. గోదావరి పుష్కరాల తొలి రోజు ఉదయం 6.26 గంటలకు స్నానం చేస్తే శుభం కలుగుతుందని భారీ స్థాయిలో జరిగిన ప్రచారం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కమిటీ నిర్ధారించింది. వార్తా పత్రికలు, టీవీ ఛానళ్లతోపాటు సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్‌లలో విస్తృత స్థాయిలో జరిగిన ప్రచారంతో లక్షలాది మంది భక్తులు తెల్లవారుజామునే పుష్కరఘాట్‌కు చేరుకున్నారని కమిటీ పేర్కొంది. బారికేడ్లను తోసుకుంటూ ఒక్కసారిగా ఘాట్‌లోకి దిగేందుకు యత్నించడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలిపింది. పుష్కర స్నానాలు చేసే వారిని గుడ్డిగా నమ్మించడంలో మీడియా ప్రధాన పాత్రను పోషించిందని, ఈ కారణంగానే 27 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని పేర్కొంది. పనె్నండు రోజుల పాటు జరిగే పుష్కరాల్లో ప్రతి రోజూ పుణ్యమైనదేనని, ఈ ఇంగితాన్ని తెలుసుకోని ప్రసార మాధ్యమాలు, ప్రవచన పండితులు, పంచాంగకర్తలు, స్వామీజీలు ప్రజలను మూఢ నమ్మకాల పాల్జేశారని కమిటీ తెలిపింది. పుష్కర సమయంలో ఏ సమయంలో స్నానం చేసినా అది పుణ్యప్రదమే అనే విషయాన్ని పురాణాల్లో పేర్కొన్నారని, దీనిని ఏ ఛానల్‌లోనూ సరిగా చెప్పలేకపోయారని అభిప్రాయపడింది. గొప్ప విషయాన్ని చెబుతున్నట్లుగా భావించి ఆ ‘ముహూర్తం’ అన్న విషయానికి ప్రాధాన్యం ఇవ్వడంతో లక్షలాది మంది గోదావరి తీరంలో పడిగాపులు పడ్డారని పేర్కొంది. ముహూర్తకాలంలోనే స్నానం చేయకపోతే పుణ్యం రాదేమోనన్న బెంగతో యాత్రికులు ఒక్కసారిగా వెల్లువై నదిలోకి పరుగులెత్తడమే తొక్కిసలాటకు ప్రధాన కారణంగా కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. ఈ దుర్ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కారణం కాదని కమిషన్ అభిప్రాయపడింది. ఆయన వెళ్లిపోయిన తర్వాతే తొక్కిసలాట జరిగిందన్నారు. ప్రచారం, రాజకీయ లబ్ధి కోసమే చాలా మంది తీవ్ర ఆరోపణలు చేసినట్లుగా కమిషన్ అభిప్రాయపడింది. ప్రమాదం జరిగిన ఘాట్ వెడల్పు 300 మీటర్లు మాత్రమే ఉండడం ఒక్కసారి రద్దీ పెరగడం దీనికి కారణమని నివేదికలో పేర్కొన్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ వీడియోలు సహా అన్ని వీడియోలను పరిశీలించామంటూ అధికారంలోలేని పార్టీలు రాజకీయ నేతృత్వంలో ప్రతి రంగాన్ని విమర్శలకు వాడుకోవాలనుకోటాన్ని గమనించామని కమిషన్ పేర్కొంది. సీఎంను దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఎక్కువ మంది చేసారని పేర్కొంది.

పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట (ఫైల్ ఫొటో)