రాష్ట్రీయం

ఉల్లాసంగా పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: అధికార టీడీపీ సహా కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి చేరుతున్న నాయకులతో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర విశాఖలో ఉల్లాసంగా కొనసాగుతోంది. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో బుధవారం ఉదయం ముచ్చెర్ల నుంచి మొదలైన పాదయాత్ర గిడిజాల, వేమగొట్టిపాలెం, సెంచూరియన్ యూనివర్శిటీ, పాలవానిపాలెం మీదుగా 6.6 కిమీ మేర పాదయాత్ర చేశారు. ముచ్చర్ల వద్ద శిబిరం నుంచి పాదయాత్ర ప్రారంభం కాగానే
పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, అభిమానులు జగన్‌తో కలిసి అడుగులేశారు. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు జగన్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల రాష్ట్రానికి మేలు చేకూరుతుందని నాలుగేళ్లుగా ఎదురు చూశామని, అయితే తమ అంచనాలు ఫలించలేదన్నారు. రాజమండ్రి నుంచి వచ్చిన కాపు యువత జగన్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా జీ సిగడం మండలం నుంచి వచ్చిన పలువురు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. పాదయాత్ర సెంచూరియన్ యూనివర్శిటీకి చేరుకున్న సందర్భంలో పలువులు విద్యార్థులు జగన్‌తో కలిసి సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. నగరానికి చెందిన పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కొండా రాజీవ్ పాదయాత్రలో జగన్‌ను కలిశారు. కాపు కార్పొరేషన్‌కు రూ.10వేల కోట్లు కేటాయిస్తామన్న చంద్రబాబు నిలువునా మోసం చేశారని ఆరోపించారు. పాదయాత్రలో భాగంగా పలువురు వికలాంగులు తమ సమస్యలు వివరించారు.