రాష్ట్రీయం

వందేళ్ల వామపక్ష నేత కోటేశ్వరమ్మ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: కమ్యూనిస్ట్ యోధురాలు, నక్సల్స్ ఉద్యమ నేత కొండపల్లి సీతారామయ్య భార్య కొండపల్లి కోటేశ్వరమ్మ బుధవారం తెల్లవారుజామున విశాఖలో కన్నుమూశారు. కొద్ది రోజుల కిందట ఆమె తన వందవ పుట్టిన రోజును ఆత్మీయుల మధ్య జరుపుకొన్నారు. ఆ తరువాత కొద్ది రోజులకే తీవ్ర ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కోటేశ్వరమ్మ కుమార్తె అనురాధ ఇంట్లోనే చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అవయవదానం కోసం కోటేశ్వరమ్మ మృత దేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. కోటేశ్వరమ్మ మృతి పట్ల పలువురు నాయకులు తీవ్ర సంతాపాన్ని తెలియచేశారు. కమ్యూనిస్ట్ పార్టీల రాష్ట్ర నాయకులు జేవీ సత్యనారాయణమూర్తి, నర్సింగరావు, పీఓడబ్ల్యు నాయకులు కోటేశ్వరమ్మ మృత దేహం వద్ద నివాళులు అర్పించారు.
కృష్ణా జిల్లా పామర్రులో జన్మించిన కోటేశ్వరమ్మకు బాల్య వివాహం జరిగింది. తన ఎనిమిదవ ఏటనే భర్త చనిపోయారు. తరువాత సంఘంలోని కట్టుబాట్ల కారణంగా పునర్వివాహం జరిపించేందుకు ఆమె కుటుంబ సభ్యులు వెనకాడారు. అప్పటికే కమ్యూనిస్ట్ స్కూల్‌లో చదువుతున్న కొండపల్లి సీతారామయ్యతో వివాహం జరిపించాలని నిర్ణయించారు. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు వివాహానికి మద్దతు పలికారు. దీంతో రాజేశ్వరరావు ఇంట్లోనే గోప్యంగా
కొండపల్లి సీతారామయ్య, కోటేశ్వరమ్మకు వివాహం జరిగింది. అప్పటి నుంచి భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. ఉన్న ఆస్తులను తెగనమ్మి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. కొండపల్లి సీతారామయ్య నక్సల్స్ ఉద్యమాన్ని బలంగా నడిపిస్తున్న సమయంలో కోటేశ్వరమ్మను అప్పటి ప్రభుత్వాలు తీవ్రంగా హింసించాయి. అనేక బాధలను, ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటూనే ఉద్యమాన్ని నడిపించుకుంటూ వచ్చారు. వందేళ్ల తన సుదీర్ఘ పయనంలో చవి చూసిన అనుభవాలతో నిర్జన వారధి శీర్షికతో పుస్తకాన్ని రాశారు.