రాష్ట్రీయం

రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ట్రిపుల్ తలాక్‌ను నేరంగా చూపిస్తూ ఆర్డినెన్స్ తేవడం రాజ్యాంగ విరుద్ధమని మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. బుధవారం అసదుద్దీన్ ఒవైసీ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ చర్యను తూర్పారబట్టారు. ఆర్డినెన్స్ ముస్లిం మహిళలకు వ్యతిరేకమైందని, ముస్లింల స్వేచ్చకు భంగకరమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లాంలో వివాహం అనేది సివిల్ కాంట్రాక్ట్ వంటిదని, ఇందులో ప్యానెల్ ప్రొవిజన్లు తీసుకుని రావడం భావ్యం కాదన్నారు. ఈ ఆర్డినెన్స్ వల్ల ముస్లిం మహిళలకు న్యాయం చేకూరదు కాబట్టి వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాజ్యాంగం పేర్కొంటున్న సమాన హక్కుల అంశం కేవలం ముస్లిం మహిళలకు మాత్రమే వర్తింపజేయడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని ఆయన విమర్శించారు. ఆర్డినెన్స్‌ను అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్టు మహిళా సంస్థలు కోర్టులో సవాల్ చేయాలని అసద అన్నారు. ఆర్డినెన్స్ తేవడం పట్ల ముస్లిం మహిళలు సంతోషంగా ఉన్నారన్న ప్రశ్నను ఆయన తోసిపుచ్చారు. ఎక్కడ సంతోషంగా ఉన్నారో చూపించాలని ఆయన ఎదురు ప్రశ్నించారు. ముస్లిం మహిళల స్వేచ్ఛకు భంగకరంగా ఉన్న ఆర్డినెన్స్‌పై తాను దేశవ్యాప్తంగా ముస్లింలలో చైతన్యం తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తామని అసదుద్దీన్ తెలిపారు.