రాష్ట్రీయం

ప్రజాకోర్టులోనే తేల్చుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంపై ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీలా ఉందని ఆయన దుయ్యబట్టారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన ఆజాద్ బుధవారం గాంధీ భవన్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్‌పీ మాజీ నేత కె. జానారెడ్డి, మాజీ ఎంపీ వి. హనుమంత రావు తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గందరగోళంలో ఉందని, అబద్ధాలైన ఏకాభిప్రాయంతో చెబితే బాగుండేదని ఆజాద్ అభిప్రాయపడ్డారు. యుద్ధ విమానాల కొనుగోలును గత యుపీఎ ప్రభుత్వం కంటే తక్కువ ధరకు ఖరీదు చేసినట్లు ముగ్గురు మూడు రకాలుగా చెప్పారని ఆయన విమర్శించారు. ఈ ఏడాది జూన్ 23న కేంద్ర న్యాయ శాఖ మంత్రి మాట్లాడుతూ యుపిఎ కంటే తాము 9 శాతం తక్కువ ధరకు ఖరీదు చేశామని గొప్పగా చెప్పారని అన్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి ఒక సందర్భంలో మాట్లాడుతూ యుపీఏ కంటే 20 శాతం తక్కువ దరకు ఖరీదు చేశామని చెబితే, ఏయిర్ ఫోర్టు అధికారి మరో రెండు అడుగులు ముందుకేసి 40 శాతం తక్కువ ధరకు ఖరీదు చేశామని ఆయన ఉదహరించారు. ప్రజలకు ఏదైనా చెప్పాలనుకుంటే ముందుగా ఐక్యంగా నిర్ణయం తీసుకోవాలని, కనీసం అబద్ధమైనా ఏకాభిప్రాయంతో చెప్పాలని ఆయన నవ్వుతూ అన్నారు. ఈ కొనుగోలు వ్యవహారం మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ చేశారని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నిజానికి సంబంధిత మంత్రులే చూసుకుంటారని ఆయన తెలిపారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగినందున విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా, కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన
ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేస్తుంటే సభలోనే ఉన్న ప్రధాని మోదీ సమాధానం చెప్పలేదన్నారు. రక్షణ శాఖకు సంబంధించిన రహస్యాలను బయట పెట్టరాదన్న నియమాన్ని గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపీఎ ప్రభుత్వమే చేసిందన్న ఒక ప్రశ్నను ఆజాద్ తోసిపుచ్చారు. అటువంటి నిబంధన తాము ఏదీ చేయలేదని అన్నారు.
ఈ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటు కమిటీ (జేపీసీ)తో విచారణ జరిపించాలన్న డిమాండ్‌నూ కేంద్రం పట్టించుకోలేదని ఆయన తెలిపారు. అయితే సుప్రీం కోర్టుకు వెళతారా? అని ప్రశ్నించగా, ప్రజా కోర్టుకు వెళ్లాలని, ప్రజల ముందు పెట్టాలని పార్టీలో తాము నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈ భారీ కుంభకోణాన్ని దేశ వ్యాప్తంగా ప్రజల్లో ఎండగడుతున్నామని ఆజాద్ తెలిపారు. తలాఖ్‌పై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌పై స్పందించేందుకు ఆజాద్ నిరాకరించారు. మిగతా అంశాలపై గురువారం స్పందిస్తానని ఆయన చెప్పారు. ఇలాఉండగా టీయుడబ్ల్యుజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ అజాద్‌ను కలిసి జర్నలిస్టుల సంక్షేమం గురించి ఎన్నికల ప్రణాళికలో పేర్కొనాలని కోరారు.

చిత్రం..గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలతో ముచ్చటిస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్