రాష్ట్రీయం

ప్రతిరోజూ హైదరాబాద్ టు బ్యాంకాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు ప్రతీ రోజు రెండు సార్లు విమానాలను నడపడానికి ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ముందుకువచ్చింది. వచ్చే నెల అక్టోబర్ 10 నుంచి ప్రారంభించే హైదరాబాద్-బ్యాంకాక్ విమాన టికెట్ల బుకింగ్‌ను పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఇంటర్నేషనల్, డొమిస్టిక్ రెండు రూట్ల నుంచి ఈ విమానాలు బయలుదేరనున్నాయి. స్పైస్‌జెట్ సీనియర్ అధికారి శిల్పా భాటియా మొదటి టికెట్‌ను మంత్రి కేటీఆర్‌కు అందజేసారు. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు వెళ్ళాలంటే ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి వెళ్లడానికి మాత్రమే ప్రస్తుతం సదుపాయం ఉందని శిల్పా భాటియా తెలిపారు. హైదరాబాద్ నుంచి నేరుగా బ్యాంకాక్‌కు విమాన సదుపాయాన్ని ప్రారంభించిన మొట్టమొదటి సంస్థ తమదేనన్నారు. ప్రారంభ ఆఫర్‌గా హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు రూ.10,001, బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు రూ.8316 చార్జీ వసూలు చేయనున్నట్టు స్పైస్‌జెట్ ప్రకటించింది.

చిత్రం..హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు నడపనున్న డైరెక్ట్ ఫ్లయిట్ టికెట్ల బుకింగ్‌ను లాంఛనంగా
ప్రారంభిస్తున్న పరిశ్రమల మంత్రి కేటీఆర్. చిత్రంలో స్పైస్‌జెట్ ప్రతినిధులు