రాష్ట్రీయం

సూర్య, చంద్రప్రభ వాహనాలపై కోనేటి రాయుడి అభయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 19: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడవరోజైన బుధవారం ఉదయం శేషాచలాధీశుడు సూర్యప్రభ వాహనంపైన, రాత్రి చంద్రప్రభ వాహనంపైన ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య స్వామివారు సూర్యప్రభ వాహనంపై యోగముద్రలో బదరీ నారాయణుడి అవతారంలో తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. సూర్యుడు ఆరోగ్య కారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత, ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ది పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీ మన్నారాయణడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శించే భక్తులకు ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్థాయి అనంతరం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు శ్రీదేవీ, భూదేవీ సమేతుడైన శ్రీ మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. సాయంత్రం 6 నుంచి 7గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరిగింది
చంద్రప్రభ వాహనంపై సర్వజగద్రక్షకుడు
బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన బుధవారం రాత్రి 8నుంచి 10 గంటల మధ్య శ్రీమలయప్పస్వామి చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ రాజసాన్ని భక్తులకు కనువిందు చేశారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారు దర్శనమిచ్చి తన చల్లని అమృత కిరణాలతో భక్తులను అమృత స్వరూపులను చేశారు. నక్షత్రాలకుచంద్రుడు అధిపతి, శ్రీవారు సమస్త విశ్వాసానికి అధిపతి. వాహనం చంద్రుడు ఆహ్లాదకారి, శ్రీ వారు చంద్ర మండల మధ్యస్థుడై పరమాహ్లాదకారి అయ్యాడు. సర్వకళా సమాహారాత్మకుడైన ఆదినారాయణుడు తన కళల నుంచి 16 కళ లు చంద్రునిపై ప్రసరింపజేసినందువల్లే చంద్రుడు కళానిధి అయ్యాడు. చంద్రదర్శనంతో సముద్రం ఉప్పొంగినట్లే, చంద్రప్రభామధ్యస్థుడైన శ్రీ కల్యాణ చంద్రుణ్ణి దర్శించడంతో భక్తుల హృదయ క్షీరసాగరాలు ఉత్తుంగ ప్రమోద తరంగాలతో పొంది ఆనందిస్తాయి. చంద్రప్రభ వాహనంలో శ్రీవారిని దర్శించడం సకలతాపహరం, పాపహరంగా భావిస్తారు. సూర్య, చంద్రప్రభ వాహనాలపై కొలువుదీరి కదలివస్తున్న ఆ దేవదేవుని దర్శించుకు ని, కర్పూర నీరాజనాలు సమర్పించుకుని భక్తులు తన్మయులయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు, బోర్డు సభ్యులు సుధానారాయణమూర్తి, ఇన్చార్జ్ సీవీఎస్వో శివకుమార్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
చిత్రం..బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం చంద్రపభ వాహనంపై
తిరుమల మాడ వీధుల్లో అభయ ప్రదానం చేస్తున్న శ్రీమలయప్పస్వామి