రాష్ట్రీయం

మెడికల్ ఫీజులపై నోరెందుకు మెదప లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట) సెప్టెంబర్ 19: బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాసరావు నాలుగేళ్లు వైద్య, ఆరోగ్యశాఖామంత్రిగా ఉన్నప్పుడు నోరుమెదపని బీజేపీ ఎమ్మెల్యేలు నేడు రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కళాశాలలు, యూనివర్శిటీల యాజమాన్యాలు మెడికల్ ఫీజులు అధికంగా వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నాయని ప్రభుత్వంపై దండెత్తటం సరికాదని రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ‘రాష్ట్రంలో మెడికల్ ఆడ్మిషన్ల కౌన్సిలింగ్ విధానంలో సమస్యలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి యనమల చర్చలో మాట్లాడుతూ ఏ కేటగిరి విద్యార్ధులకు తెలంగాణా రాష్ట్రంలో 60 వేలు ఫీజు వసూలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 10 వేలు మాత్రమే ఫీజు వసూలు చేస్తున్నారన్న విషయం బీజేపీ ఎమ్మెల్యేలు గుర్తించాలని కోరారు. అలాగే బీ కేటగిరిలో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లో సమానంగా మెడికల్ ఫీజు వుందని స్పష్టం చేశారు. మెడికల్ సీట్లు విషయంలో పేద విద్యార్థులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదన్నారు. మెడికల్ ఫీజు పెంపువిషయం 2015లో కామినేని శ్రీనివాసరావు వైద్య, ఆరోగ్యశాఖామంత్రిగా వున్నప్పుడే జీవో ఇచ్చారన్న సంగతి బీజేపీ ఎమ్మెల్యేలు గ్రహించి ఆనాడే వ్యతిరేకిస్తే బాగుండేదని ఆయన గుర్తుచేశారు. అంతకుముందు మెడికల్ అడ్మిషన్లపై జరిగిన చర్చలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్, యూనివర్శిటీలు అడ్డూ అదుపులేకుండా అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడికీ పాల్పడుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటంలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో సంవత్సరానికి 30 నుంచి 40 లక్షల వరకు ప్రేవేటు మెడికల్ కాలేజీలు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని నిలదీశారు. అంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు మెడికల్ కళాశాలలలో ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే 5 సంవత్సరాలలో 2 కోట్ల రూపాయలు ఫీజులు చెల్లించాల్సి వస్తుందన్నారు. దీంతో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు మెడికల్ సీట్లలో అన్యాయం జరుగుతుందన్నారు. మెడికల్ కౌనె్సలింగ్ సమయంలో విద్యార్ధుల సర్ట్ఫికెట్లను పరిశీలించిన అనంతరం యాజమాన్యాలు వెంటనే తిరిగిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి ప్రైవేటు మెడికల్ కళాశాలల ఫీజుల దోపిడికి కళ్ళెం వేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర మాట్లాడుతూ మెడికల్ కౌనె్సలింగ్ సమయంలో సర్ట్ఫికెట్లు పరిశీలనలో నిబంధనలు సడలించాలని అన్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఒక్కొక్కచోట ఒక్కొ విధంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని మంత్రి యనమల దృష్టికి తీసుకోచ్చారు.