రాష్ట్రీయం

సింగిల్‌గా వచ్చినా.. గుంపుగా వచ్చినా ఓడిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, సెప్టెంబర్ 19 : అధికారం, కుర్చీల కోసం అన్ని పార్టీలు కలసి పొత్తులు పెట్టుకుంటున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు విరుచుకుపడ్డారు. గుంపులుగా వచ్చినా, సింగిల్‌గా వచ్చినా చిత్తుగా ఓడిస్తామని బుధవారం ఆయన ప్రకటించారు. అధికారం కోసం తెలంగాణ ద్రోహులంత ఒక్కటవుతున్నారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా గుర్రాలగొంది గ్రామంలో బుధవారం మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల నామినేషన్ ఫీజు కోసం గ్రామంలోని వివిధ కుల సంఘాలు 30,216 రూపాయలు విరాళాన్ని, ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని అందచేశారు. గుర్రాలగొంది రేణుక మాత ఆలయ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోని పోలవరంకు జాతీయ హోదా ప్రకటించి, తెలంగాణలోని ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదాను విస్మరించారన్నారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు మోసం చేసింది..ఇప్పుడూ మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎపీకి ప్రత్యేక హోదా ఇస్తానని రాహుల్‌గాంధీ అంటున్నారని, హోదా కల్పిస్తే తెలంగాణకు అన్యాయం జరుగదా ? అని ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్నందుకు వారికి ఓటేయ్యాలని ప్రశ్నించారు. అధికారం కోసం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతున్నాడని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాకుండా చివరి వరకూ అడ్డుకున్నాడన్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ, పాలమూరు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వవద్దని కేంద్రంపై వత్తిడి తెచ్చారన్నారు. తెలంగాణకు అన్యాయం చేసినందుకు టీడీపీకి ఓటేయ్యాలని ప్రశ్నించారు. టీజేఎస్ అధినేత కోదండరామ్ సీఎం కేసీఆర్ నీడలో ఏదిగారని, తనకు, తాను గొప్పగా ఊహించుకుంటున్నారని హరీష్ ఎద్దేవా చేశారు. కోదండరామ్ కేవలం 2,3 సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు పొర్లుదండాలు పెడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగర్ రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా కోదండరామ్ మాట్లాడుతున్నారని దుయ్యపట్టారు. బీజేపీ పార్టీ నేత అమిత్‌పా తెలంగాణకు ఒక్క రూపాయి సహాయం చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని 50 సార్లు ఢిల్లీ చుట్టు సీఎం కేసీఆర్, తాను తిరిగినా ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చారా? ప్రశ్నించారు. నిధులు ఇవ్వని బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. మహారాష్టక్రు ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధుల వరద కురిపించారన్నారు. బీజేపీ నేతలు నిన్నటి వరకు చంద్రబాబుతో కలసి తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. హైకోర్టు విభజన చేయాలని పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కోరిన పట్టించుకోలేదని విమర్శించారు. విభజన సమయంలో రాత్రికి రాత్రికి 7 మండలాలను ఆంధ్రలో కలిపి తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. కుర్చీలు, అధికారం కోసం అపవిత్ర పొత్తులు, చీకటీ ఒప్పందాలకు తెరలేపుతున్నారని దుయ్యపట్టారు. మహాకూటమీ అధికారంలోకి వస్తే ఢిల్లీ, అమరావతి ముందు చేతులు కట్టుకొని మొకరిల్లే పరిస్థితి వస్తుందన్నారు. ఆత్మగౌరవంగా మనల్ని మనమే పరిపాలించుకోవాలని, సీఎం కేసీఆర్ దేశానికి ఆదర్శవంతమైన పాలన సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. గుర్రాలగొంది గ్రామస్తులు నామినేషన్‌కు డబ్బులిచ్చి, ఊరంగా నాకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసి కొత్త దశ, దిశను, చరిత్రను సృష్టించారన్నారు. అనంతరం మంత్రి హరీష్‌రావు వివిధ కుల సంఘాల ఏకగ్రీవ తీర్మానం, నామినేషన్ డబ్బులిచ్చి, సన్మానం చేశారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నాయకులు రవీందర్‌రావు, వేలేటీ రాధకిషన్‌శర్మ, ముక్కిస సత్యనారాయణరెడ్డి, పరకాల మల్లేశం, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.