ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో టూరిజానికి సొబగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అమరావతిలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎస్సెల్ గ్రూప్ ఆసక్తి చూపింది. కొత్త రాజధాని నగరంలో ఫన్ అండ్ రిక్రియేషన్ కోసం మల్టీ స్టోరీడ్ కాంప్లెక్స్ నిర్మించడానికి ముందుకొచ్చింది. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన ఎస్సెల్ వరల్డ్ ప్రతినిధులు తమ ఆలోచనలను సిఎం ముందుంచారు. అమరావతి టూరిజం సర్క్యూట్‌లో భాగం అవుతామని వారు పేర్కొనగా సమగ్ర ప్రతిపాదనలతో రావాలని సిఎం వారికి సూచించారు. ఏపిలో ఆకర్షణీయమైన ద్వీపాలను సుందర ప్రదేశాలుగా తీర్చిదిద్ది వాటిని పర్యాటక ప్రాంతాలుగా మలుచుతామని ఎస్సెల్ వరల్డ్ వైస్ చైర్మన్ అశోక్ గోయల్ చెప్పారు. దీనిపై సిఎం స్పందిస్తూ, ఏపీలో ప్రకృతి సిద్ధమైన ఆకర్షణీయ ప్రాంతాలు అడుగడుగునా ఉన్నాయన్నారు. ఏపిలో టూరిజం ముఖ్యమైన గ్రోత్ ఇంజన్‌గా గుర్తించామని, రానున్న కాలంలో ఈ రాష్ట్రం పర్యాటక రంగానికి గమ్యస్థానంగా మారుతుందని చెప్పారు. పర్యావరణ హితంగా సహజ సిద్ధమైన విఆధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తామని ఎస్సెల్ గ్రూప్ ప్రతినిధులు వివరించారు. కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ సహాయ మంత్రి సుజనాచౌదరి, టూరిజం ముఖ్యకార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, సిఎం కార్యదర్శి సాయిప్రసాద్ సమీక్షలో పాల్గొన్నారు.

చిత్రం... ఎస్సెల్ ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు